EPAPER

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Wall Cleaning Tips: ఇంటి గోడలపై మరకలు పడటం సర్వసాధారణం. కానీ గోడలపై ఉన్న మరకలు ఇంటి అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీలైనంత వరకు మరకలు పడకుండా చూసుకోవాలి. ఒక వేళ గోడలు, వస్తువులపై మరకలు పడ్డా కూడా త్వరగా తొలగించాలి. ఇదిలా ఉంటే గోడలపై ఉన్న మరకలను కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా కూడా తొలగించవచ్చు.


ఇంటి గోడలు మురికిగా మారడం సర్వసాధారణం. ముఖ్యంగా కిచెన్, హాల్ గోడలకు మరకలు ఎక్కువగా పడుతుంటాయి. కొన్నిసార్లు గోడలపై నూనె మరకలు కూడా పడుతుంటాయి. అందుకే చాలా మంది సంవత్సరానికి ఒకసారి గోడలకు రంగులు వేయడం, లేదా క్లీన్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇలా గోడలను అందంగా కనిపించేలా చేయడానికి రకరకాల పద్ధతులు పాటించవచ్చు.

గోడలు మన ఇంటి అందాన్ని పెంచుతాయి, కానీ కాలక్రమేణా అవి దుమ్ము, మరకలతో మురికిగా మారుతాయి. ఈ మరకలను తొలగించడం ద్వారా మీరు మీ గోడలకు కొత్త రూపాన్ని ఇవ్వవచ్చు. గోడలపై ఉన్న మరకలను తొలగించే కొన్ని ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


గోడలపై ఉన్న మరకలను ఇలా తొలగించండి..

1.టైల్స్ క్లీనింగ్..
కావలసినవి:
వెచ్చని నీరు
తేలికపాటి డిటర్జెంట్
సోడా
బ్రష్

శుభ్రం చేయు విధానం: ఒక బకెట్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొద్దిగా డిటర్జెంట్, సోడా వేయాలి. ఈ నీటిలో బ్రష్‌ను ముంచి, టైల్స్ శుభ్రం చేయండి. మొండి మరకల కోసం, బేకింగ్ సోడా పేస్ట్ కూడా అప్లై చేసి, కాసేపు ఉంచి, ఆపై బ్రష్‌తో శుభ్రం చేయండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగి పొడి గుడ్డతో తుడవండి. ఇలా చేయడం వల్ల ఎంతటి జిడ్డు మరకలైనా ఈజీగా తొలగిపోతాయి.

2.హాల్ గోడలపై మరకలు..
కావలసినవి:
వెచ్చని నీరు
తేలికపాటి డిటర్జెంట్
మృదువైన క్లాత్ లేదా స్పాంజ్

శుభ్రం చేయు విధానం: ఒక బకెట్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొద్దిగా డిటర్జెంట్ వేయాలి. ఈ నీటిలో మెత్తటి క్లాత్ లేదా స్పాంజిని ముంచి పిండేసి నెమ్మదిగా గోడను శుభ్రం చేయండి. ఆ తర్వాత పొడి క్లాత్ తో గోడలను తుడవండి. ఈ చిట్కా గోడలను మెరిసేలా చేస్తుంది.

3.వాల్‌పేపర్డ్ గోడలు..

కావలసినవి:
డస్టర్ లేదా సాఫ్ట్ బ్రష్
ఉప్పు
నిమ్మరసం
బేకింగ్ సోడా
వాక్యూమ్ క్లీనర్

శుభ్రం చేయు విధానం: వాల్‌పేపర్ దెబ్బతినకుండా ఉండటానికి మృదువైన బ్రష్ లేదా డస్టర్‌ని ఉపయోగించండి. వాక్యూమ్ క్లీనర్, మృదువైన బ్రష్ ఉపయోగించి ముందుగా
వాల్‌పేపర్డ్ గోడలపై ఉన్న దుమ్మును తొలగించండి. ఆ తర్వాత వేడి నీటిలో బేకింగ్ సోడా కాస్త నిమ్మరసం, ఉప్పు వేసి మొండి మరకలు ఉన్న చోట కాస్త తడి గుడ్డ లేదా డస్టర్ తో రుద్దండి. వాల్‌పేపర్‌ను తడిచే ముందు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ నీటిని ఉపయోగించి వాల్ పేపర్ గోడలను రుద్దకండి.

4.గోడలపై నూనె మరకలు..
కావలసినవి:
డిష్వాష్ బార్
వెచ్చని నీరు
స్పాంజ్

Also Read: గ్యాస్ బర్నర్ మురికిగా మారిందా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మెరుస్తుంది

శుభ్రం చేయు విధానం: గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్ బార్ కలపండి. ఆ తర్వాత ఈ నీటిలో స్పాంజిని ముంచి మరకలపై రుద్దండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగండి. అనంతరం పొడి క్లాత్‌తో తుడవండి. ఈ చిట్కాతో గోడలపై ఉన్న నూనె మరకలతో పాటు ఇతర మరకలు ఈజీగా తొలగిపోతాయి. గోడలు తిరిగి కొత్త వాటిలాగా కనిపిస్తాయి.

కొన్ని అదనపు చిట్కాలు..

ఏదైనా కొత్తగా కొన్న లిక్విడ్, క్లీనర్‌ని మొత్తం గోడపై ఉపయోగించే ముందు ఇంట్టోని ఓ చిన్న ప్రాంతంలో పరీక్షించండి.

పై నుండి క్రిందికి శుభ్రం చేయండి: గోడలను శుభ్రం చేసే ముందు మురికి పై నుంచి క్రిందికి వచ్చేలా గోడను శుభ్రం చేయండి.

రెగ్యులర్ క్లీనింగ్: ఇంట్లో గోడలపై మురికి పేరుకుపోకుండా గోడలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Big Stories

×