EPAPER

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

YS Jagan On CBN 100 Days Government: ఎన్నికలు జరిగినప్పటి నుంచి చంద్రబాబు ప్రజలను చూసి.. నీకు 15 వేలు, నీకు 18 వేలు, నీకు 40 వేలు అని చెప్పి.. ప్రజల ఆశలు, జీవితాలతో చెలగాటమాడారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుది 100 రోజుల పాలన కాదని, 100 రోజుల మోసం అన్నారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు, సూపర్ 7 లేదు.. అంతా మాయేనని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన లేకుండా చేసి.. పిల్లలపై ఒత్తిడి వచ్చేలా చేశారని విమర్శలు గుప్పించారు.


గోరుముద్ద గాలికి..

ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్వమయ్యాయని, ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయని, గోరుముద్ద కూడా గాలికి ఎగిరిపోయిందన్నారు. 104, 108 సిబ్బందికి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇంతవరకూ జీతాలు లేవన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయన్నారు. పేదల ఆరోగ్యం గురించి పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రభుత్వ కాలేజీలు కట్టించడంలో స్కాములు చేస్తున్నారని ఆరోపించారు. ఇక వ్యవసాయం విషయానికొస్తే.. చంద్రబాబు హయాంలో రైతు రోడ్డున పడ్డాడని వాపోయారు. రైతుకు రూ.25 వేలు ఇస్తామన్న సీఎం.. ఇంతవరకూ ఒక్కరూపాయి కూడా పెట్టుబడి సహాయం, ఉచిత పంటల బీమా ఇవ్వలేదన్నారు. ఏ రంగం చూసినా తిరోగమనంగానే ఉందన్నారు.


గతంలో తమ హయాంలో అన్నీ డోర్ డెలివరీ చేశామని, ఈరోజున డోర్ డెలివరీ రేషన్, డోర్ డెలివరీ పెన్షన్ లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమవుతుందో అర్థం కావడంలేదన్నారు. రెడ్ బుక్ పాలనతో రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి, ధర్మానికి రక్షణ లేకుండా.. ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. అబద్ధపు కేసుల్లో ఇరికిస్తూ.. ఇష్టారాజ్యంగా రాజ్య పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి అడుగులోనూ డైవర్షనే కనిపిస్తోందన్నారు.

ముమ్మాటికీ మ్యాన్ మేడ్ వరదలే..

విజయవాడ వరదలు కూడా ప్రభుత్వం అలసత్వమే అని విమర్శించారు జగన్. వరద ప్రమాదం పొంచి ఉందని ముందే హెచ్చరించినా.. సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. బుడమేరు, ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ అని వాపోయారు. వీటిని డైవర్ట్ చేసేందుకు.. చంద్రబాబు ప్రకాశం బ్యారేజీలో బోట్లు అడ్డుపడ్డాయని కొత్త టాపిక్ తెచ్చారన్నారు. అసలు ఆ బోట్లను అక్కడ పెట్టుకున్నదే చంద్రబాబు అని, ఇసుక మాఫియా కోసమే చంద్రబాబు ఆ బోట్లను అక్కడ పెట్టుకున్నాడని ఆరోపించారు జగన్. అంతకుముందు ముంబై నుంచి హీరోయిన్ కాదంబరి జత్వానీని తెచ్చి మరో డైవర్షన్ చేశారన్నారు.

100 రోజుల పాలనకు డైవర్షన్ లడ్డూ

చంద్రబాబు 100 రోజుల పాలనపై దృష్టి పెట్టడంతో.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశాడన్నారు. దేవుడిని కూడా తన స్వార్థానికి వాడుకునే చంద్రబాబు లాంటి దుర్మార్గమైన వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఉండడని సంచలన ఆరోపణలు చేశారు జగన్. 100 రోజుల పాలనలో ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబు అతి దుర్మార్గంగా లడ్డూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుతో చేసిన ఫ్యాట్ ను వాడారని ఆయన చేసిన ఆరోపణలు ధర్మమేనా అని ప్రశ్నించారు.

Also Read: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

తిరుమలలో ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యికి టెండర్లు పిలుస్తారని, ఇది చాలా సాధారణమైన విషయం అన్నారు. లడ్డూ తయారీలో వాడే పదార్థాలు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయని, ఆరునెలల్లో ఎవరు ఎల్ 1గా వస్తారో వారికే ఇస్తారని తెలిపారు జగన్. లడ్డూ తయారీకి వాడే పదార్థాలకు క్వాలిటీ టెస్టులు మూడు దశల్లో జరుగుతాయని, అవన్నీ పాసయ్యాకే లడ్డూ తయారీకి వాడే పదార్థాలు తీసుకొచ్చే వెహికల్స్ ను ముందుకు పంపిస్తారని తెలిపారు. ఇన్ని టెస్టులు జరుగుతుంటే యానిమల్ ఫ్యాట్ వాడారని, నాసిరకం నూనె వాడారని రకరకాలుగా చెప్పడం ధర్మం కాదన్నారు. గతంలో ఇలాంటి టెస్టులు జరిగినపుడు చంద్రబాబు హయాంలో పలుమార్లు రిజెక్ట్ అయ్యాయని, తమ హయాంలో 18 సార్లు రిజెక్ట్ అయ్యాయని జగన్ ప్రస్తావించారు.

జులై 12న శాంపిల్స్ తీసుకున్నారంటే.. చంద్రబాబు హయాంలోనే తీసుకున్నట్లేనన్నారు. వాటిలో కల్తీ ఉందని రావడంతో.. వాళ్లు జులై 23న రిపోర్ట్ ఇచ్చారన్నారు. అప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు 2 నెలలుగా లడ్డూ కల్తీ గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడు 100 రోజుల పాలనపై ప్రజలు హామీల గురించి ప్రశ్నిస్తుంటే.. ఆ రిపోర్టును ఇప్పుడు వాడుకుని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. లడ్డూలో కల్తీ జరిగిందని భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, మన గుడిని, మన దేవుడిని అభాసుపాలు చేసుకున్నామన్నారు.

ఆంధ్రరాష్ట్రం దౌర్భాగ్యమిది

టీటీడీ గొప్ప వ్యవస్థ అని, అందులో ఉండేవారిని సెలెక్ట్ చేయడం అంత ఈజీ కాదన్నారు జగన్. టీటీడీలో బోర్డు మెంబర్లకు కేంద్రమంత్రుల నుంచి రికమెండేషన్లు వస్తాయని, దానికంటే కేబినెట్ కూర్పు చాలా సులభమన్నారు. వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్పస్వామి మాల వేసుకున్నారని, ఆయన్ను మించిన భక్తుడు టీటీడీ ఈఓగా ఉంటారా అని ప్రశ్నించారు. గురుస్వామిగా ఉన్న వ్యక్తిపై కూడా విమర్శలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఇది ఆంధ్రరాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు. వైసీపీ హయాంలో టీటీడీ అనేక మంచి కార్యక్రమాలు జరిగాయన్నారు. వైసీపీ వచ్చాకే నవనీత సేవ మొదలైందన్నారు. ఇందుకోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండపై గోశాల పెట్టామని, ఆలయంలో అర్చకుల జీతాలను రెండింతలు చేశామన్నారు. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించడంతో పాటు.. దేశంలో కట్టిన టీటీడీ ఆలయాలన్నీ వైసీపీ హయాంలో కట్టినవేనన్నారు. 9 వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా తామేనన్నారు. మఠాధిపతులతో విధ్వత్సదస్సు నిర్వహించామన్నారు.

తిరుమల లడ్డూ పై చంద్రబాబు చేసిన రాజకీయాలను పీఎం మోదీకి, సీజేఐకి లేఖ రాస్తానని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరుతానని చెప్పారు జగన్.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×