Vivo గతవారం భారతీయ మార్కెట్లో Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 19 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌లలో సేల్‌కి అందుబాటులోకి వచ్చింది.

ఇది మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 గా ఉంది.

అదే సమయంలో 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999గా కంపెనీ నిర్ణయించింది. 

అలాగే టాప్ రేంజ్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లాట్ రూ. 3000 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపుతో వివో టి3 అల్ట్రా 5జీ ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

ఇది కాకుండా నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. దాదాపు 6 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది.

ఇది 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2800×1260 పిక్సెల్‌ల 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. అదే సమయంలో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

Mediatek డైమెన్సిటీ 9200+ 4nm ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఫోన్‌లో సేఫ్టీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh బ్యాటరీని అందించారు.

వెనుక భాగంలో ZEISS ఆప్టిక్స్, OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ SONY IMX921 కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.