EPAPER

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Vote for Note Case: ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టుకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారనే దానిపై ఆరోపణలు తప్ప ఆధారాలు లేవన్న సుప్రీంకోర్టు.. ఈ దశలో జగదీశ్ రెడ్డి పిటిషన్ ను ఎంటర్ టైన్ చేయలేమని తేల్చి చెప్పింది. కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్ కు రిపోర్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఏసీబీకి కూడా ఆదేశాలు జారీ చేసింది.


ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించిన ధర్మాసనం.. మున్ముందు సీఎం రేవంత్ రెడ్డి కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.

ఆగస్టు నెలలోనూ కేసు ట్రయల్ బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దానిని కొట్టివేసింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయడం కుదరదని, కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే.. న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్టే అవుతుందని వ్యాఖ్యానించింది.


Also Read: ఓటుకు నోటు కేసు, పిటిషన్ డిస్మిస్

2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేలా ఓటర్లకు డబ్బు పంచాలని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బు అప్పగించినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు – స్టీఫెన్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ, చంద్రబాబు- రేవంత్ భేటీలో డబ్బు అప్పజెప్పిన వీడియో ఫుటేజీ బయటికి రావడంతో.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇందులో రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉందని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించడంతో.. కేసు విచారణపై ఉత్కంఠ పెరిగింది. వరుస వాయిదాల తర్వాత రేవంత్ కు ఊరట లభించింది.

Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×