EPAPER

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Biryani Cooking Tips: బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. బిర్యానీ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఒక్కసారిగా బిర్యానీ తినాలి అనే ఆలోచన వస్తే చాలు వెంటనే వెళ్లి బిర్యానీ కొనుక్కుని తినేస్తుంటారు. అందులో ముఖ్యంగా మన దేశంలో బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీనే గుర్తుకు వస్తుంది. ఇందులో వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అంటూ ఎన్నో రకాలు ఉంటాయి. శాఖాహారులకు వెజ్ బిర్యానీలు, మాంసాహారులకు నాన్ వెజ్ బిర్యానీలు అంటూ ఎన్నో రకాలు ఉంటాయి.


బిర్యానీ అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ తరుణంలో బయట బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయట తయారు చేసిన బిర్యానీని తినడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఎందుకంటే బయట తయారుచేసే బిర్యానీలో మసాలాలు, నూనె ఎక్కువగా వాడుతుంటారు. అందువల్ల తరచూ తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధింత సమస్యలు ఎదురవుతాయి.

అందువల్ల బయట కొనుగోలు చేసి తినే బిర్యానీ మాదిరిగానే ఇంట్లోనే ఎంతో రుచికరమైన బిర్యానీని తయారుచేసుకుని తినవచ్చు. ఇంట్లోనే ఎంతో సింపుల్ గా బిర్యానీని తయారుచేసుకుని తింటే ఆరోగ్యంగాను, ఇష్టమైన, రుచికరమైన బిర్యానీని కూడా తిన్నట్టు ఉంటుంది. ఇంట్లోనే చిన్న చిట్కాలు తయారుచేసుకుంటే రెస్టారెంట్ టేస్ట్ మాదిరి ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. బిర్యానీని తయారుచేసుకునే సమయంలో అందులో వేసే మసాలాతోనే దానికి రుచి వస్తుంది.


లవంగాలు, యాలకులు, షాజిరా, షామ్రిచ్, జాజికాయ, దాల్చిన చెకక్, జైత్రి వంటి మసాలా దినులసులను బాగా వేయించి మిక్సి పట్టి పొడి తయారుచేసుకోవాలి. దీనిని బిర్యానీలో వాడితే ఎంతో రుచిగా వండుకోవచ్చు. అంతేకాదు బిర్యానీలో లీన్ మీట్ ఉపయోగిస్తే అద్భుతంగా తయారవుతుంది. ఇక ఏ బిర్యానీ తయారుచేయాలనుకున్నా కూడా అందులో నూనె, నెయ్యి రెండు వాడితే మంచిది. బిర్యానీని తయారుచేసుకు 30 నిమిషాల ముందే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని నీటిలో ఉప్పు, వెనిగర్ వేసుకుని మరిగిన నీటిలో బియ్యం వేసి 80 శాతం ఉడికేంత వరకు వండుకోవాలి. ఇలా చేసుకుంటే అన్నం అతుక్కోకుండా ఉంటుంది.

బిర్యానీ మసాలా సిద్ధం చేసుకున్న తర్వాత బిర్యానీ కోసం కలుపుకునే సమయంలో అందులో కారం, ఉప్పు, మసాలాలు, పెరుగు, అల్లం, నూనె, పూదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, కసూరీ మేతి, రెండు లేదా మూడు పచ్చిమిర్చి, నిమ్మ రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్ద పాత్రలో తీసుకుని దానిపై ఉడికిన అన్నం వేసి నెయ్యి, మసాలా, ఫ్రైడ్ ఆనియన్ వేసి పాత్రపై మూత పెట్టుకుని డైరెక్ట్ గా స్టవ్ పై పెట్టకుండా, ఓ పెద్ద తవా తీసుకుని దానిపై పెట్టి వండుకోవాలి. ఇలా చేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్లోనే బిర్యానీ తయారుచేసుకుని తినవచ్చు.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Big Stories

×