EPAPER

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Pawan Kalyan Calls For Setting Up Of Sanatana Dharma Rakshana Board: ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించడం హిందువులతో పాటు అందరి మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.


వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డే దీనికి సమాధానం చెప్పాలన్నారు. లడ్డూ విషయంపై టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగా దీనికి సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వివాదం వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంటే చేపనూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కలపడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దేశ వ్యాప్తంగా దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ బోర్డు ఏర్పాటుపై చర్చలు జరగాలన్నారు. ఇందులో దేవాలయాల అపవిత్రత, భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్దతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేలా ఉండాలన్నారు.

అలాగే సనాతన ధర్మ రక్షణ బోర్డు విషయంపై జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యావవ్యవస్థ, పైరులు, మీడియా సంబంధిత వర్గాలతో చర్చించాలన్నారు. సనాతన ధర్మాన్ని అందరం కాపాడేందుకు కలిసి రావాలని కోరారు.

Also Read: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

అంతకుముందు, తిరుపతి లడ్డూలో వాడుతున్న కల్తీ నెయ్యిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 50 ఏళ్ల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ని కాదని, వేరే కంపెనీకి కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు వాస్తవాలు బయట పడ్డాయని, ఇందులో ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. దేవుడిపై జగన్ రెడ్డికి నమ్మకం లేదని ఆరోపించారు. అలాగే ప్రజలపై నమ్మకం లేదని, ప్రజలు ఇచ్చిన తీర్పుపై కూడా నమ్మకం లేదన్నారు.

తిరుపతి లడ్డూలో కలిపిన నెయ్యిపై ఆధారాలు చూపించామని, ల్యాబ్ రిపోర్ట్‌లు సైతం ముందు పెట్టామని, ఇంకా ఏమి నిరూపించాలని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ తయారీకి జంతువు నుంచి తీసిన కొవ్వు వాడారని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలిందన్నారు. ఎవరైతే ఈ చర్య వెనుక ఉన్నారో, అందరిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు శిక్ష విధిస్తామన్నారు. ఇదిలా ఉండగా, మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. నేను తిరుపతిలోనే ఉన్నా.. ప్రమాణానికి సిద్ధంగా ఉన్నా. మీరు రెడీనా? అంటూ సవాల్ విసిరారు.

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా విజయవాడలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూ ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అసలు విషయాలు బయటకొచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిని జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఆరోపించారు.

 

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×