EPAPER

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Pushpa 2: డేవిడ్ వార్నర్ గురించి తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండడు. డేవిడ్ వార్నర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. స్టేడియంలో బంతిని బాధడం మాత్రమే కాకుండా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ తో రచ్చ లేపుతుంటారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమా భారీ స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సుకుమార్ అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు దేవి.


పుష్ప సినిమా మ్యానియా

పుష్ప సినిమాకి సంబంధించిన డైలాగ్స్ సాంగ్స్ అంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 100 వీడియోస్ లో ఒక 70 వీడియోలలో పుష్ప సినిమా రీల్స్ కనిపించేవి. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీస్ కూడా పుష్ప సినిమా డైలాగ్స్ ను సాంగ్స్ ను రీ క్రియేట్ చేసేవాళ్ళు. అలానే డేవిడ్ వార్నర్ కూడా చాలా సందర్భాల్లో పుష్ప సినిమా సాంగ్స్ డైలాగ్స్ ను రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాళ్ళు. .అప్పటినుంచి డేవిడ్ వార్నర్ కు ఫాలోవర్స్ పెరగడంతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని చాలామంది అడిగే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు.


David Warner

డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్

ఎట్టకేలకు డేవిడ్ వార్నర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తనని బాగా పాపులర్ చేసిన పుష్ప సినిమాతోనే ఎంట్రీ ఇవ్వనున్నట్లు విశ్వసనీ వర్గాల సమాచారం. పుష్ప టు సినిమాలో డేవిడ్ వార్నర్ ఒక గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా డేవిడ్ వార్నర్ ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షార్ట్ హెయిర్ తో చేతిలో గన్ పట్టుకొని ఆ ఫోటోలో కనిపిస్తున్నాడు డేవిడ్ వార్నర్. సేమ్ అదే లుక్ తో పుష్ప టు సినిమాలో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటివరకు అధికార ప్రకటన రాలేదు. బహుశా దీనిని మేకర్స్ ఒక సడన్ సర్ప్రైజ్ ల ప్లాన్ చేసి ఉండొచ్చు.

మరోసారి ప్రపంచ వ్యాప్తంగా

ఏదేమైనా పుష్ప సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా మరో వెయ్యి కోట్లను సాధించి పెడుతుందని చాలామంది గట్టి నమ్మకం. ఎన్నోసార్లు పోస్ట్ పోన్ తర్వాత డిసెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాతో మరోసారి ప్రపంచమంతా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు తలెత్తి చూడనుంది అని కొంతమంది అభిప్రాయం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

Related News

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Big Stories

×