EPAPER

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

long iron pole on railway tracks: దేశంలో గత కొంతకాలంగా రైళ్ల ప్రమాదానికి భారీ కుట్ర జరుగుతోంది. ఇటీవల పట్టాలపై రాళ్లు, సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలు ఉంచి రైళ్ల ప్రమాదానికి కొంతమంది దుండగులు ప్రయత్నించారు. ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ఘోర రైలు ప్రమాదం తప్పింది.


ఉత్తరాఖండ్‌లోని బిలాస్ పూర్ రోడ్- రుద్రపూర్ పట్టణాల మధ్య పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్ ఉంచారు. అయితే జన్ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ పట్టాలపై ఇనుప రాడ్ ఉన్నట్లు గుర్తించి అప్రమత్తమయ్యాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు నిలిచిపోయింది. దీంతో ఘోర రైలు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే లోకో పైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న జీఆర్ఫీ, పోలీసుల అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ట్రాక్ పై ఉంచిన 6 మీటర్ల ఇనుప రాడ్‌ను అధికారులు తొలగించారు. దీంతో రాడ్ తీసేసిన తర్వాత రైలు అక్కడి నుంచి ముందుకు కదిలింది. ఈ ఘటన రాత్రి చోటుచేసుకుంది.


వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బల్వంత్ ఎన్‌క్లేవ్ కాలనీ సమీపంలో నైనీ జన్ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణిస్తున్న రైలు పట్టాలపై దుండగులు 6 మీటర్ల ఇనుప రాడ్ ఉంచారు. లోకో పైలట్ అప్రమత్తం కావడంతో దుండగులు పన్నిన కుట్ర భగ్నమైంది. రైలు నంబర్ 12091 లోకో పైలట్ 43/10-11 వద్ద బిలాస్ పూర్ రోడ్ – రుద్ర పూర్ సిటీ మధ్య రైలు ట్రాక్ పై 6 మీటర్ల పొడవు గల ఇనుప రాడ్ గుర్తించినట్లు సిటీ స్టేషన్ మాస్టర్ వెల్లడించారు. లోకో పైలట్ రైలు ను ఆపడంతో ప్రమాదం తప్పిందన్నారు. వెంటనే ఆ ట్రాక్ క్లియర్ చేసి రైలు ను సురక్షితంగా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Also Read: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ ప్రారంభంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఓ గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు కుట్ర పన్నారు. ఏకంగా ట్రాక్‌పై పెద్ద 70కిలోలకు పైగా ఉన్న రెండు సిమెంట్ దిమ్మెలను ఉంచారు. అయితే ఆ గూడ్స్ రైలు రెండు దిమ్మెలను ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అలాగే ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్‌లో భివాని- ప్రయాగ్ రాజ్ కాళింది ఎక్స్ ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు యత్నించారు. పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెలు, సిలిండర్‌ను రైలు పట్టాలపై ఉంచారు. లోకో పైలట్ గుర్తించి రైలును నిలిపివేశాడు. అయితే సిలిండర్ ను రైలు ఢీకొట్టింది. వెంటనే పరిశీలించగా.. సమీపంలో ఓ పేలుడు పదార్థం కనిపించింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. రైల్వే ట్రాక్ పై బండరాళ్లు, రోడ్డు, రాడ్ లను ఉంచారని, వీటిపై రైల్వే విచారణ కొనసాగుతుందని చెప్పారు. మరో వైపు పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×