EPAPER

Jr NTR : తారక్ షాకింగ్ డెసిషన్… ఇక తెలుగు దర్శకులతో పని లేదా?

Jr NTR : తారక్ షాకింగ్ డెసిషన్… ఇక తెలుగు దర్శకులతో పని లేదా?

Jr NTR : ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా జేజేలు అందుకుంటున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. కానీ పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ ఆయనను మార్చేసినట్టుగా కన్పిస్తోంది. తాజాగా ఆయన దేవర ఈవెంట్ లో చేసిన ఒక పని ఇక తెలుగు దర్శకులతో ఆయనకు పనే లేదా? అనే డౌట్ వచ్చేలా చేసింది.


నెక్స్ట్ మూడు సినిమాలు వాళ్ళతోనే.. 

ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు భాగాలుగా విడుదల కానున్న దేవర సినిమా ప్రమోషన్ పై దృష్టి సారించాడు. మొదటి భాగం సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. దేవరలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరో వారం తరువాత థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ను చూపించారు తారక్. అది మాట వరసకే అన్నాడు అనుకున్నా కూడా ఎన్టీఆర్ లైనప్ చూస్తే షాక్ తప్పదు.


పాన్ ఇండియా హీరో కావడానికి రాజమౌళి లాంటి తెలుగు దర్శకులను నమ్ముకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం కన్నడ, హిందీ, తమిళ దర్శకులతో కలిసి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడం గమనార్హం. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర తర్వాత, ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 లో కనిపించనున్నాడు. ఆ తర్వాత కన్నడ సినిమాకు చెందిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ కూడా తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాడు, అది త్వరలో కార్యరూపం దాల్చవచ్చు. ఈ సినిమాలు విజయం సాధిస్తే పాన్-ఇండియా అగ్ర నటుడిగా ఎన్టీఆర్ స్థానం సుస్థిరంగా స్థిరపడుతుంది. కానీ అది ఆయనను తెలుగు దర్శకులకు దూరం చేస్తుంది అనేది నిజం.

Pic: 'Devara' star Jr NTR surprises fans with trendsetting stubble beard  look | Telugu Movie News - Times of India

ఎన్టీఆర్ కన్నా ప్రభాస్ బెటర్ 

బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాల బిగ్గెస్ట్ విజయం పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్. కానీ ఆ తరువాత ఇలా ఎన్టీఆర్ లాగా వెంటనే తెలుగు దర్శకులను వదిలేసి హిందీతో పాటు పరభాషా దర్శకులపై ఆసక్తిని చూపించలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇలా పాన్ ఇండియా ఫేమ్ వచ్చిందో లేదో అలా ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. కానీ మరోవైపు జక్కన్న, ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు తెలుగు వాళ్ళకే పట్టం కడుతున్నారు.

కేవలం వెట్రిమారన్ తో మాత్రమే కాదు మరో తమిళ దర్శకుడు అట్లీతో కూడా సినిమాను చేయాలనే కోరికను ఎన్టీఆర్ వ్యక్తం చేశారు. అట్లీ షారుఖ్ లాంటి హీరోకు 1000 కోట్ల సినిమాను ఇచ్చినప్పటికి ఆయనపై కాపీ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కలిసి ఎన్టీఆర్ సినిమాను పభావితం చేసే అవకాశం లేకపోలేదు. మరి ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలి అనుకునే తెలుగు దర్శకుల పరిస్థితి ఏంటో?!

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×