EPAPER

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Redmi Note 14 series: చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి గ్లోబల్ మార్కెట్‌లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అదే సమయంలో దేశీయ మార్కెట్‌లో సైతం సత్తా చాటుతోంది. ఇందులో భాగంగానే తన లైనప్‌లో ఉన్న రెడ్‌మి ఫోన్లను వరుసగా రిలీజ్ చేస్తుంది. త్వరలో Redmi Note 14 సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో Redmi Note 14, Redmi Note 14 Pro, Redmi Note 14 Pro+ వంటి మోడల్‌లను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి కంపెనీ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో సిరీస్‌కి ‘strong and durable’ (బలమైన, మన్నికైనది) అనే ట్యాగ్‌ని అందించింది.

అయితే అంతా బాగానే ఉంది అని అనుకునే సమయంలో షియోమి గట్టి షాక్ ఇచ్చింది. ఈ సిరీస్‌లోని Redmi Note 14 Pro+ 5G మోడల్‌లో వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ వినియోగదారులను నిరాశపరిచే అవకాశం ఉందని సమాచారం. పాత మోడల్‌తో పోలిస్తే కంపెనీ ఈ నోట్ 14 ప్రో ప్లస్ మోడల్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని తగ్గించిందని తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సామార్థ్యంతో రాబోతుందని తెలుస్తోంది. అయితే దీని పాత మోడల్ అయిన Redmi Note 13 Pro+ 5Gలో కంపెనీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించింది.

దీని బట్టి చూస్తే కంపెనీ కొత్త మోడల్‌ సామర్థ్యంలో చాలా తగ్గించిందనే చెప్పుకోవాలి. కాగా కంపెనీ Redmi Note 11 Pro+ 5G లాంచ్ సమయం నుండి 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తూ వస్తోంది. అయితే ఇంతవరకు 120వాట్ సామర్థ్యంతో వచ్చిన ఫోన్లు.. ఇప్పుడు తాజా సిరీస్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం తగ్గడం వినియోగదారులను నిరాశపరచవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

కంపెనీ Redmi Note 13 5Gని 33W ఛార్జింగ్ నుండి 45Wకి పెంచబడింది. అదే సమయంలో త్వరలో రాబోతున్న Redmi Note 14 5Gలో కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని పెంచింది. ఇక ప్రో మోడల్స్‌లో ఇది గణనీయంగా తగ్గింది. దీనికి కారణం కొత్త మోడళ్లలో ఆప్టిమైజేషన్‌ని ఉపయోగించడమే అని తెలుస్తోంది. అయినా ఫోన్ 90W సామర్థ్యంతో చాలా వేగంగా ఛార్జ్ చేయగలదని సమాచారం. కానీ వీటికి సంబంధించిన వివరాలు అఫీషియల్‌గా రిలీజ్ అయ్యేవరకు ఏంటనేది పూర్తిగా చెప్పలేం.

ఇక ఈ Redmi Note 14 సిరీస్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Redmi Note 14, Redmi Note 14 Pro, Redmi Note 14 Pro+లలో వనిల్లా మోడల్ అత్యంత తక్కువ ధరలో ఉంటుంది. ఇది 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ని ప్రాసెసింగ్‌గా అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

1.5K OLED డిస్‌ప్లేను Redmi Note 14 Pro, Pro+లో అందించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెండూ వెనుక భాగంలో OIS మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటాయి. అలాగే Snapdragon 7s Gen 3 చిప్‌ని Redmi Note 14 Proలో అందించే అవకాశం ఉంది. అదే సమయంలో డైమెన్సిటీ 7350 SoC ప్రాసెసర్‌ని ప్రో+లో ఇవ్వవచ్చని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×