EPAPER

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Will Jeevan Reddy beat BJP in Telangana Graduate MLC Election: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రాడ్యేయేట్ ఎమ్మెల్సీ‌ సందడి పెరిగిపోతుంది. ఇంకా షెడ్యూల్ వెలువడక ముందే.. అవకాశం కోసం అశావాహులు ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.  సీనియర్ నాయకుడు , సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నా.. టికెట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.. దాంతో జీవన్ రెడ్డి కూడా సైలెంట్‌ అయి హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో మిగిలిన నాయకులు టికెట్ రేసులోకి దూసుకొచ్చి హడావుడి మొదలు పెడుతున్నారు.


కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహాలం మొదలు అయ్యింది. అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ‌స్థానాన్ని కాపాడుకునేందుకు ఇప్పటినుండే వ్యూహలు రూపొందిస్తుంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కి మరోసారి అవకాశం ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అధిష్టానం తీరుపై జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ని కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయంలో గతంలోనే అలక బూనారు.

కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న జీవన్‌రెడ్డి 1983 నుంచి ఇప్పటి వరకు జగిత్యాల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ సంజయ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది.


ఆ క్రమంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కేబినెట్ స్థాయి పదవి వస్తుందని అశ పడ్డారు. కాని ఎలాంటి పదవి రాలేదు.  కనీసం మరోమారు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా కనపడటం లేదు.. కాంగ్రెస్ ఈ సారి బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టిందంటున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి. బీజేపీకి కేంద్రమంత్రి బండి సంజయ్ సహా నలుగురు ఎంపీలు అక్కడ నుంచే ఉన్నారు. బిఅర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలలో ఆ స్థానం పరిధిలో గట్టి పొటీ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి గంగుల కమాలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు

దాంతో విపక్షాలను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ మరింత పకడ్బందీగా వ్యూహాలు పన్నాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పార్లమెంటు ఎన్నికల తరువాత జరగనున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ నుంచి మరోసారి పోటీకి జీవన్ రెడ్డి సుముఖంగా ఉన్నా అయన‌ అభ్యర్థిత్వాన్ని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు.. దాంతో అధిష్టానం ఆచితూచిగా వ్యవహారిస్తుంది. ఇప్పటికే ముఖ్యనేతల నుండి అధిష్టానం సమాచారం సేకరిస్తుంది.. ఒకవేళ జీవన్ రెడ్డి కి టికెట్ ఇవ్వకపోతే అయన పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా? లేకపోతే పార్టీ పరంగా ఏదైనా ప్రాధాన్యత లభిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.

Also Read: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

అందుకే ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోనే నిత్యం‌ ఉంటూ.. మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా, ఎంపీగా రెండు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయాడు. గతంలో కంటే ఇప్పుడు విభిన్న పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడు అన్ని పార్టీలకి కీలకంగా మారింది. ఆ నాలుగు జిల్లాల్లో బీజేపీ ఎంపీలు ఉండటంతో వారి దూకుడును జీవన్‌రెడ్డి తట్టుకోగలరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అందులోనూ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటున్నారు.

అయితే కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడే గెలిచానని.. ఇప్పుడు మరోసారి అవకాశం కల్పిస్తే సత్తా చాటుకుంటానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ధీమాతో కనిపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ‌పార్టీ‌ అధికారంలో ఉండడంతో‌ అశావాహుల సంఖ్య కూడా గతం కంటే ఎక్కువైంది. జీవన్ రెడ్డి మంచి పదవిలో‌ ఉంటారని ఎన్నికల సమయంలో మంచి భవిష్యత్తు ఉంటుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఉన్నారు.  ఆ హామీపైనే జీవన్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.  మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

 

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×