EPAPER

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

IRCTC: చాలా మంది సీజన్ బట్టి టూర్ ప్లాన్ చేసుకుంటుంటారు. కొద్ది రోజులు ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు. ప్రకృతి అందాలకు పరవసించిపోవాలని అనుకుంటారు. ఉద్యోగాలు చేస్తున్న వారైతే ఎప్పటికప్పుడు టూర్ ప్లాన్‌లలో ఉంటారు. జాబ్ స్ట్రెస్ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఓ ఐదారు రోజులు సెలవులు తీసుకుని ట్రిప్‌లు వేస్తారు. అదే సమయంలో మరికొందరు ఇంటి దగ్గర బోర్ కొట్టి తమ ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాలని అనుకుంటారు. దేవుడి దర్శనం కోసం కూడా కొందరు ట్రిప్‌లు ప్లాన్ చేస్తుంటారు.


మరి మీరు కూడా అలాంటి ట్రిప్ వేయాలనుకుంటే ఇది సరైన సమయం. ఎందుకంటే ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ అదిరిపోయే టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు టూర్ ప్యాకేజీలను అతి తక్కువ ధరలో అందించే ఐఆర్‌సిటిసి తాజాగా మరో టూర్ ప్యాకేజీను తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలో టూర్ ప్యాకేజ్ అందుబాటులో ఉంది. తాజాగా ‘డివైన్ కర్ణాటక’ పేరుతో ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ వచ్చే నెల అంటే అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 5 రోజులు 6 రాత్రులు ఉంటుంది. ఈ ప్యాకేజీ అక్టోబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. అంటే ప్రతి మంగళవారం ఈ ప్యాకేజీ లభిస్తుందన్నమాట. మరి ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చు?, ధర ఎంత?, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? అనేది పూర్తిగా తెలుసుకుందాం.


Also Read: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ముందస్తు రిజర్వేషన్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక రిజర్వేషన్ చేసుకున్న వారు.. తొలి రోజు ఉదయం 6.05 గంటలకు కాచీగూడలో 12789 (కాచిగూడ-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్) ట్రైన్ ఎక్కాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరులో దిగుతారు. అక్కడ నుంచి ఉడిపిలోని హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీకృష్ణ ఆలయం, మాల్పే బీచ్‌ను సందర్శంచుకోవచ్చు. అలా ఆ రాత్రంతా ఉడిపిలోనే బస చేస్తారు.

ఆ తర్వాత రోజు ఉదయం శృంగేరిలోని శారదాంబ ఆలయాన్ని దర్శించుకుని.. ఆపై మళ్లీ మంగళూరు చేరుకుంటారు. ఇక ఆ రాత్రంతా అక్కడ బస చేయాల్సి ఉంటుంది. అనంతరం 4వ రోజు ఉదయం ధర్మస్థలకు వెళ్తారు. అక్కడ మంజునాథ స్వామి ఆలయం, కుక్కే సుబ్రమణ్య ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం మళ్లీ మంగళూరుకు తిరిగి చేరుకుంటారు. ఇక చివరిరోజు కదిరి మంజునాథ ఆలయం, మంగళదేవి ఆలయాల్ని దర్శించుకున్న తర్వాత తన్నెరభావి బీచ్, కుద్రొలి గోకర్నాథ దేవాలయం వంటి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ మంగళూరు రైల్వేస్టేషన్ చేరుకుని రాత్రి 8 గంటలకు 12790 ట్రైన్ ఎక్కి ఆ మరుసటి రోజు కాచిగూడ చేరుకుంటారు.

ఇక ఈ టూర్ ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. సింగిల్ షేరింగి రూమ్‌కు రూ.38,100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్విన్ షేరింగ్‌కు రూ.22,450, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.18,150గా ఉంది. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిల్డ్రెన్స్‌కు బెడ్‌ కావాలంటే రూ.11,430, బెడ్ లేకుండా అయితే రూ.9,890గా నిర్ణయించారు. అందువల్ల మీరు కూడా ఒక మంచి టూర్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం అని చెప్పాలి.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×