EPAPER

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

Hydra: హైడ్రా విచారణ ఎంతవరకు వచ్చింది. జలవనరుల శాఖ వద్ద నిర్మిస్తున్న అపార్టుమెంట్లు లోతుగా విచారణ చేస్తోందా? చెరువులను ఆక్రమించి వాటిని కడుతున్నారా? భారీ క్రేన్ల నిర్వాహకులతో హైడ్రా ఎందుకు సంప్రదింపులు చేస్తోంది? లేక్ వ్యూ భవనాలపై కన్నేసిందా? ఇవే ప్రశ్నలు లేక్ వ్యూ ప్రాంతల ప్రజలను వెంటాడుతోంది.


హైదరాబాద్ సిటీలో లేక్ వ్యూ అపార్ట్‌మెంట్లకు మాంచి గిరాకీ ఉండేది. లేక్ సమీపంలో అపార్ట్‌మెంటు వుంటే చాలని బావించేవారు. ఇదంతా ఒకప్పుటి మాట. ప్రభుత్వాలు మారాయి.. పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. లేక్ వ్యూ అపార్ట్‌మెంట్ అంటే వద్ద బాబోయ్ అంటున్నారు వినియోగదారులు.

లేక్‌లను కబ్జాను నిర్మిస్తున్న భారీ భవనాలను కడుతున్న విషయం ఆలస్యంగా వినియోగదారులకు అర్థమైంది. అలాంటి భవనాల వైపు ప్రస్తుతం చూడటం మానేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలు ఆక్రమించి కడితే వెంటనే వాటిని కూల్చివేయాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వినియోగదారులు ఆలోచనలోపడ్డారు.


జలవనరుల శాఖ భవనాల సమీపంలో లేక్ ఉండేదని వాటిని కబ్జా చేసి నిర్మిస్తున్న.. నిర్మించిన భవనాల మాటేంటని ప్రత్యర్థుల నుంచి హైడ్రాకు ప్రశ్నలు వెల్లువెత్తాయి. పరిస్థితి గమనించిన హైడ్రా అధికారులు, వాటిపై లోతుగా విచారణ చేస్తున్నారు. మరోవైపు భారీ క్రేన్ల నిర్వాహకులతో మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన వాటిపై హైడ్రా కూల్చివేసే ఛాన్స్ ఉందంటూ అప్పుడు వార్తలు గుప్పుమన్నాయి.

ALSO READ: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

లేక్ వ్యూ ప్రాజెక్టుల జాబితాలో బడా నిర్మాణ సంస్థలకు చెందిన ప్రాజెక్టులున్నాయి. రెండుమూడు వేల ఫ్లాట్లతో ప్రాజెక్టులున్నాయి. చాలా లేక్ వ్యూ అపార్ట్‌మెంట్లు లేక్ లను కబ్జా చేసి భవనాలు నిర్మించి నట్టు తేలిందట.

జలవనరుల శాఖ భవనాల వద్దేకాదు.. రాయదుర్గం లేక్ వద్ద కూడా అదే పరిస్థితి వుందని అంటున్నారు. సిటీలోని లేక్ వ్యూ పరిసర ప్రాంతాల్లో అపార్టుమెంట్లపై దృష్టి సారించింది హైడ్రా. ఈ వారంలో వాటికి సంబంధించి విచారణ పూర్తి అవుతుందని అంటున్నారు.

వచ్చేవారం హైడ్రా ఫీల్డ్‌లోకి రావచ్చని అంటున్నారు. ఈ క్రమంలో భారీ క్రేన్ల నిర్వాహకులతో మంతనాలు సాగిస్తుందని తెలుస్తోంది. గతంలో నొయిడా, కేరళలోనూ చెరువులను ఆక్రమించి కబ్జా చేసిన భారీ ఎత్తున భవనాలను కట్టేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని అధికారులు కూల్చివేసిన విషయం తెల్సిందే.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×