EPAPER

Balineni Srinivasa Reddy: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని? ముహూర్తం ఫిక్స్!

Balineni Srinivasa Reddy: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని? ముహూర్తం ఫిక్స్!

ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతన్న వార్తలకు.. ఎట్టకేలకు నిజం చేశారు బాలినేని శ్రీనివాస రెడ్డి. జనసేనలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు బాలినేని. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చలు తర్వాత.. తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక బాలినేని బాటలోనే.. మరికొందరు ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరతున్నట్లు తెలుస్తోంది

మరోవైపు బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాకతో..ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. కీలక నేత తమ పార్టీకి మరింత బలం తెస్తాడని జనసైనికుల్లో మరింత జోష్ నెలకొంది. ఇది ఇలా ఉంటే..బాలినేని శ్రీనివాస రెడ్డి రాక పట్ల కొంతమంది జిల్లా జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారు.


Also Read: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

జనసేనలో బాలినేని చేరతారన్నప్పటి నుంచి.. జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ సైలెంట్ అయిపోయారు. మరోవైపు రియాజ్‌ను సొంత జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆయన వల్లే.. జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఎదగలేకపోతుందని మరికొంత మంది జనసేన నేతల అభిప్రాయం. వీటిన్నిటినిపై జనసేన చీఫ్ ఏవిధంగా హ్యాండిల్ చేస్తారు. బాలినేనికి ఎలాంటి భరోసా.. ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది కాసేపట్లో క్లారిటీ రానుంది.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను.. ఆ పార్టీ పట్ల అయిష్టంగా ఉన్నారు. దీంతో ఈయన కూడా బాలినేని బాటలోనే జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు ప్రచారం. వీరితో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరంతా టీడీపీ, జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు.

మరోవైపు మాజీ మంత్రి విడదల రజని, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్.. కందుకూరు మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీని వీడతారని ప్రచారం. వారితో పాటు బాలినేని అనుచరులు సైతం పార్టీ వీడేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇతర నేతల చేరికను టీడీపీ, జనసేన పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదని తెలుస్తోంది. గతంలో ఆ పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టిన తీరుతో..ఇప్పుడు వారి రాకపై కాస్త వెనక్కి తగ్గుతున్నారు. దీంతో మూడు పార్టీల నిర్ణయం తర్వాతే.. పార్టీలో చేర్చుకోవాలని ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాయి. ఇందులో ఏ ఒక్కరికి నచ్చకపోయిన.. ఆ నేతలను పార్టీలో తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×