EPAPER

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Cambodia Cyber Slaves Agent| ఫారిన్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ కంప్యూటర్ పని తెలిసిన వారిని ఒక యువతి నమ్మించి విదేశాలకు పంపిస్తుంది. అలా పంపించేందుకు ఆమెకు తలసరి రూ.30000 కమిషన్ అందుతుంది. కానీ ఉద్యోగాల కోసం ఫారిన్ వెళ్లినవారు ఇక తిరిగి రావడం లేదు. వాళ్లు పరాయి దేశంలో బానిసలు జీవించాల్సి వస్తోంది. ఇంతవరకు జరిగిందే ఒక ఎత్తు అయితే.. ఆ బానిసల చేత సైబర్ దొంగతనాలు చేయించి అమాయకుల బ్యాంక్ అకౌంట్లు దోచుకుంటున్నారు. ఇదంతా కంబోడియాలో జరుగుతోందని ఇదివరకే తరుచూ మీడియాలో వచ్చింది. అయితే తాజాగా ముంబైకి చెందిన ఓ యువతిని ఈ కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.


కంబోడియా దేశ రాజధాని ఫినామ్ పెన్ లో జూలై నెలలో ఇండియన్ ఎంబసీ.. అక్కడ బానిసలు బతుకుతున్న 14 మంది భారతీయులను కాపాడింది. అప్పటి నుంచి దాదాపు 650 మంది భారతీయులను.. కంబోడియా నుంచి కాపాడి ఎంబసీ అధికారులు ఇండియాకు తిరిగి పంపించారు. అలా తిరిగి వచ్చిన భారతీయులను విచారణ చేయగా.. అందులో చాలా మంది ఓ యువతి ద్వారా అక్కడికి వెళ్లారని తెలిసింది. వారందరినీ ఆ యువతి మోసపూరితంగా కంబోడియా పంపించిందని వారు చెప్పారు.

వారిలో కొందరు హైదరాబాద్ కు చెందిన యువత కూడా ఉండడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు వేగంగా విచారణ చేస్తూ.. ఆ యువతి కోసం ముంబై చేరుకున్నారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో నివసించే ప్రియాంక్ శివ్ కుమార్ సిద్దు అనే 30 ఏళ్ల మహిళను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేశారు.


Also Read: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ప్రియాంక గతంలో ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది. అక్కడ ఏ దేశం వీసా ఎలా పొందాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి? ఆ ప్రక్రియ మొత్తం తెలుసుకుంది. కానీ ఆ ట్రావెల్ ఏజెన్సీకి లైసెన్స్ లేదని అధికారులు ఆ ఏజెన్సీని మూసేసి దాని యజమానిని అరెస్టు చేశారు.

అయితే అప్పటి నుంచి ప్రియాంక డబ్బులు సంపాదించేందకు కొత్త ప్లాన్ వేసింది. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆ దేశ విజిట్ వీసా (పర్యటన వీసా మాత్రమే) ఇప్పించి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలూ చేసింది. ఆమె మాటలు విని విదేశాలకు వెళ్లిన వారు తమ వీసాపై ఉద్యోగం లభించదని తెలిసి మోసపోయి తిరిగి వచ్చేవారు. ప్రియాంక చాలా తెలివి ఒక ప్రాంతంలో మూడు లేదా 6 నెలలు మాత్రమే ఆపరేట్ చేసేది. ఆ ప్రాంతంలో నుంచి మరో ప్రాంతానికి మకాం మార్చేసి మళ్లీ అక్కడ అదే దందా చేసేది. ఈ క్రమంలో ఆమెకు నారాయణ అనే మరో ట్రావెల్ ఏజెన్సీకి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు.

నారాయణ తరుచూ కంబోడియా వెళ్లేవాడు. నారాయణకు ఒక చైనా కంపెనీ యజమాని స్నేహితుడు. అలా నారాయణ.. ప్రియాంకను ఆ చైనా కంపెనీ యజమానితో ఒక డీల్ చేయించాడు. ఇండయా నుంచి కంప్యూటర్ ఆపరేటింగ్ పని తెలిసిన యువతను కంబోడియాకు పంపిస్తే.. ఆ కంపెనీ ప్రియాంకకు ఒక్కో వ్యక్తిపై తలసరి రూ.30 వేలు కమీషన్ ఇస్తుంది.

దీంతో ప్రియాంక కొత్త బిజినెస్ మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో యాడ్ లు ఇచ్చింది. కంప్యూటర్ ఆపరేటింగ్ ఉద్యోగమని.. నెలకు రూ.2 లక్షల దాకా జీతం అని నమ్మించింది. ఆ యాడ్ లు దేశ వ్యాప్తంగా చాలా మంది యువత ప్రియాంకు సంప్రదించారు. ఆమె వారి వద్ద నుంచి కూడా రూ.20000 వేల నుంచి రూ.80000 దాకా తీసుకొని కంబోడియా పంపించింది. అలా కంబోడియా వెళ్లిన వారు.. అక్కడ చైనా కంపెనీకి చెందిన ఒక బిల్డింగ్ లో ఖైదీలుగా మారారు. వారితో ఆ కంపెనీ సైబర్ మోసాలు, సైబర్ దొంగతనాలు చేయించింది.

చెప్పిన పని చేయకపోతే వారికి ఆహారం ఇవ్వరు. చితకబాదడం, కరెంట్ షాక్ ఇవ్వడం లాంటివి చిత్రహింసలు చేస్తారు. అయితే ప్రియాంక ఈ క్రమంలో ఒక తప్పు చేసింది. ఏకంగా తన అక్క కొడుకుని, అతని స్నేహితుడిని కూడా డబ్బుకోసం ఆశపడి కంబోడియాకు పంపించింది. కానీ అలా వెళ్లిన ఆ ఇద్దరూ మోసపోయామని తెలిసి అక్కడి నుంచి చాలా కష్టాలు పడి తప్పించుకొని ఇండియన్ ఎంబసీ చేరుకన్నారు. ఆ తరువాత ఇండియన్ ఎంబసీ అధికారులకు విషయం తెలియడంతో కంబోడియా పోలీసుల సహాయంతో కంబోడియాలో చిక్కుకున్న్ భారతీయులను కాపాడ గలిగారు. ఇప్పటికీ అలాంటి చాలా కంపెనీలు కంబోడియాలో సైబర్ దొంగతనాల బిజినెస్ చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు ప్రచరితమవుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ప్రియాంకపై కేసులు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు.

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×