EPAPER

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరికి ధైర్యం చెప్పిన అమర్‌ – గుప్తకు హెల్ఫ్‌ చేసిన అరుంధతి

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరికి ధైర్యం చెప్పిన అమర్‌ – గుప్తకు హెల్ఫ్‌ చేసిన అరుంధతి

Nindu Noorella Saavasam Serial Today September 19th Episode: ఆరు నన్ను వదిలి వెళ్లినా ఆరు జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలడం లేదు అమర్‌ అందుకే ప్రతిక్షణం ఆరును గుర్తు చేసుకుని బాధపడుతుంటాను. అందుకే అప్పుడప్పుడు ఆరు గుర్తుకు వచ్చినప్పుడు అలా అరుస్తుంటాను. అని మనోహరి చెప్తుంది.  ఆరు గడిచిపోయిన జ్ఞాపకం మనోహరి పదేపదే గుర్తు చేసుకుని బాధపడటం ఎందుకు మర్చిపోవడానికి ప్రయత్నించు అని చెప్తాడు అమర్‌. అయితే అంత ఈజీగా ఎలా మర్చిపోగలను అంటూ కోపంగా చూస్తూనే బాధపడినట్లు నటిస్తుంది. సరే అంటూ అమర్‌ వెళ్లిపోతాడు.


అంజు చైన్‌ గురించి అడిగిన మిస్సమ్మ

మరోవైపు మిస్సమ్మ పిల్లలను పడుకోబెట్టి ఆ రూంలోంచి బయటకు వస్తుంటే అమర్‌ ఎదురుపడతాడు. మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఈ రూంలోకి మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది. నువ్వు బుక్‌ మూసినప్పుడే వచ్చానని చెప్తాడు అమర్‌. ఇవాళ జరిగిన దానికి పిల్లలు కంగారుపడ్డారేమో చూద్దామని వచ్చానని అమర్‌ చెప్పగానే మీరు పక్కన ఉండగా మాకెందుకు భయం చెప్పండి. అంటూ అంజు చైన్‌ చూపించి ఈ చైన్‌ ఎక్కడిది అని అడుగుతుంది మిస్సమ్మ.  దుర్గా మాత డాలర్‌  కోల్‌ కత్తా వాళ్లు ఎక్కువ వేసుకుంటారు. అలాంటిది అంజుకు మాత్రమే ఎందకుంది. మిగతా పిల్లలకు ఎందుకు లేదండి అంటూ మిస్సమ్మ అడగ్గానే అమర్‌ షాక్‌ అవుతాడు. ఏమీ మాట్లాడకుండా చూస్తుండిపోతాడు. ఇంతలో మిస్సమ్మే మళ్లీ  ఏంటండి ఏం మాట్లాడటం లేదు. ఈ మధ్య ఎందుకో మీరు ఏదోలా ఉన్నారు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదండి అంటూ అమర్‌ను ప్రశ్నించగానే అమర్‌ మిస్సమ్మకు నీకు చాలా విషయాలు చెప్పాలి. నువ్వు అడగనివి.. నువ్వు అనుకోనివి.. కానీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మొత్తం చెప్తాను. నీకు మాత్రమే చెప్తాను మిస్సమ్మ. అంతవరకు నన్ను డిస్టర్బ్‌ చేయకు అంటూ అమర్‌ వెళ్లిపోతాడు.   మీ బాధలు, కష్టాలు అన్నీ నేను పంచుకోవాలి అనుకున్నాను. మీకై మీరే చెప్పే  ఆరోజు కోసం నేను ఎదురుచూస్తూ ఉంటానండి అని మనసులో అనుకుని మిస్సమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


గుప్త, రాథోడ్‌ మద్య కామెడీ సన్నివేశం

తర్వాత గుప్త తన వేలుకు ఉన్న ఉంగరం దురద పెడుతుందని తీయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అక్కడ అరుంధతి ఉందేమోనని భయపడతాడు. ఎక్కడా లేదని నిర్దారించుకున్న తర్వాతే ఉంగరం తీయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అది రాకపోయే సరికి ఇక్కడి ఆహారం తిని నా శరీరమే కాదు నా వేలు కూడా లావెక్కినట్లుంది అని అనుకుంటూ బలవంతంగా ఉంగరం లాగుతాడు. దీంతో ఉంగంర వేలు లోంచ ఊడిపోయి దూరంగా పడుతుంది. గుప్త ఉంగరం కోసం అటూ ఇటూ చూస్తుంటే అది రాథోడ్‌ కాళ్ల దగ్గర పడి ఉంటుంది. రాథోడ్‌ ను చూసిన గుప్త షాక్‌ అవుతాడు. రాథోడ్‌ కూడా గుప్త వైపు కోపంగా చూస్తుంటాడు.  దగ్గరకు వెళ్లిన గుప్తను ఓ ఆటాడుకుంటాడు రాథోడ్‌. పని కావాలని అడిగి మరీ పనిలో కుదిరావు. తీరా ఎప్పుడు వస్తావో ఎప్పుడు పోతావో అర్థమే కాదు అంటూ ఉంగరం తీసుకుని తన వేలికి పెట్టకుంటాడు రాథోడ్‌. దీంతో గుప్త నా ఉంగరం నాకు ఇవ్వు అని అడగ్గానే ఇదేమైనా మాయా ఉంగరమా? ఏదీ ఇప్పుడు నన్ను గాల్లోకి తీసుకెళ్లమను అనగానే రాథోడ్‌ మెల్లగా గాల్లోకి వెళ్లిపోతాడు. దీంతో రాథోడ్‌ భయపడుతుంటాడు. ఆ ఉంగరాన్ని మళ్లీ నిన్ను కిందకు తీసుకురా అని చెప్పు అదే తీసుకొస్తుంది అని గుప్త చెప్పగానే రాథోడ్‌ అలాగే అని చెప్పగానే మళ్లీ కిందకు వస్తాడు రాథోడ్‌. దీంతో రాథోడ్‌, గుప్త మధ్య ఉంగరం కోసం పెనుగులాట జరుగుతుంది. ఉంగరం దూరంగా వెళ్లి పడుతుంది.

Also Read: రాజ్‌ కు జీతం ఇస్తానన్న కావ్య – రుద్రాణిని రాయబారానికి పంపాలన్న స్వప్న

గుప్తకు హెల్ఫ్ చేసిన ఆరు

అప్పుడే అక్కడకు ఆరు వచ్చి ఉంగరం తీసుకుంటుంది. గుప్త బాధపడుతూ నేను ఎవరికైతే ఉంగరం దొరకకూడదు అనుకున్నానో వారికే దొరికింది అని ఇక నా పని అంతా అయిపోయింది ఇక ఆ బాలిక  నా అంగుళీకము నాకు ఇవ్వదు. ఇక నేను మా లోకానికి ఎలా వెళ్లాలి. హథ విధి అనుకుంటూ బాధపడుతుంటూ గుప్తను రాథోడ్‌ చేయి పట్టి లాగుతుంటాడు. ఇంతలో ఆరు అక్కడికి వచ్చి గుప్త గారు  ఇదిగోండి మీ ఉంగరం తీసుకోండి. ఉంగరం తీసుకుని మళ్లీ మాయం అయిపోండి. అంటూ గుప్త వేలుకు ఉంగరం తొడుగుతుంది ఆరు. ఉంగరం తొడగ్గానే గుప్త మాయమైపోతాడు. గుప్త చేయి పట్టుకుని లాగుతున్న రాథోడ్‌ కిందపడిపోతాడు.  వెంటనే రాథోడ్‌ అసలు ఏం జరిగింది. తోటమాలి ఎక్కడ..? నేను కింద ఎలా పడ్డాను అని ఆలోచిస్తూ ఇదంతా నా భ్రమలా ఉంది. అనుకుని లోపలికి వెళ్లపోతాడు.

నువ్వే నాకు తొడబుట్టిన అన్నవు

తర్వాత గుప్త ఆ ఉంగరం నీ దగ్గరే ఉంచుకుంటే నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండొచ్చు కదా? మళ్లీ తిరిగి నాకెందుకు ఇచ్చావు అని ఆరుంధతిని అడుగుతాడు. దీంతో అరుంధతి మొదట్లో అయితే మీరు ఎలాంటి వారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీ గురించి నాకు పూర్తిగా అర్థం అయింది. మీరు నాకు అన్నలాంటి వారు. చెల్లి లాంటి నన్ను మీరు ఎప్పటికీ మోసం చేయరని నమ్మకం అందుకే మీ ఉంగరం మీకు ఇచ్చాను అని చెప్పి వెళ్లిపోతుది అరుంధతి. నన్ను ఇంతలా నమ్మిన నిన్ను నేను మళ్లీ మోసం చేయబోతున్నాను అని మనసులో అనుకుంటాడు గుప్త. ఇంతటితో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ ఎండ్‌ అవుతుంది.

Related News

Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతిని ఎదురించిన మీనా.. అడ్డంగా దొరికిన రోహిణి.. శృతి పెళ్లి డేట్ ఫిక్స్..

Satyabhama Serial Today September 19th: క్రిష్ ను కాపాడుకున్న సత్య.. నిజం తెలుసుకున్న మహదేవయ్య..

Trinayani Serial Today Episode: గాజులు దొంగిలించిన వల్లభ – తిలొత్తమ్మను ఓ ఆటాడుకున్న హాసిని

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కు జీతం ఇస్తానన్న కావ్య – రుద్రాణిని రాయబారానికి పంపాలన్న స్వప్న

Kirrak Couples Promo: భార్యను మోయలేకపోయిన ఆదిరెడ్డి, కంగారులో పెదవి కొరికిన షరీఫ్, ఈవారం ‘క్రిర్రాక్ కఫుల్స్‘ ప్రోమో అదుర్స్ అంతే..

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు ఘోర పూజలు – ఎలాగైనా కాపాడతానన్న గుప్త

Big Stories

×