EPAPER

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Back Pain Relief Tips: నడుము నొప్పి ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, శారీరక కారణాలు, కూర్చునే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఈ నొప్పితో బాధపడుతున్నారు. నడుము నొప్పికి మార్కెట్లో అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, హోం రెమెడీస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతే కాకుండా ఇవి దీర్ఘకాలిక ఉపశమనాన్ని కూడా అందిస్తాయి.


మీరు కూడా చాలా కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ 3 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ప్రయత్నించండి. వీటితో నడుము నొప్పి ఈజీగా తగ్గిపోతుంది. మరి హోం రెమెడీస్ ఎలా వాడాలి ? అందుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని ఐస్ క్యూబ్స్‌ని తీసుకుని వాటిని సన్నని క్లాత్ లో వేసి చుట్టండి. ఆ తర్వాత నొప్పి ఉన్న ప్రదేశంలో 15-20 నిమిషాలు పెట్టండి. ఇది వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా వేడి నీటి బాటిల్ లేదా వేడి నీటిలో ముంచిన టవల్ ను తీసుకుని దానిని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచి 15-20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇది కండరాలకు రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది.


పసుపు, పాలు :
ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకోండి. అందులో ఒక చెంచా పసుపు వేయండి. మీకు కావాలంటే దీనికి కొంచెం తేనె, బెల్లం కూడా కలుపుకోవచ్చు., తద్వారా పాల రుచి మరింత మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ఈ పాలను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ కండరాలను రిలాక్స్ చేయడంతోపాటు వాపును తగ్గిస్తుంది.  నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది.

Also Read: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

నూనెతో మర్దన:
2-3 టేబుల్ స్పూన్ల నూనె (ఆవాలు, కొబ్బరి లేదా నువ్వుల నూనె) తీసుకోండి. నూనెలో ఒక గిన్నెలో వేసి కాస్త వేడి చేయండి. ఇలా వేడి చేసిన గోరువెచ్చని నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో నెమ్మదిగా మసాజ్ చేయండి. తేలికపాటి చేతులతో 10-15 నిమిషాలు మసాజ్ చేయడం ద్వారా ఇది కండరాలకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా త్వరగా నొప్పిని కూడా తగ్గిస్తుంది.

రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ తో నొప్పి ఉన్న చోట మసాజ్ చేయండి. ఈ మసాజ్ తర్వాత శరీరం రిలాక్స్‌గా మారుతుంది. రెగ్యులర్ ఆయిల్ మసాజ్ కండరాల బిగుతును తగ్గిస్తుంది. అంతే కాకుండా వెన్నునొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. అంతే కాకుండా ఇది నడుము నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. నడుము నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ హోం రెమెడీస్ వాడటం వల్ల త్వరగా నొప్పి తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×