EPAPER

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Vegetables Price in Telugu States: ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ. ఇంట్లో భార్య లేదా పిల్లలు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తే ఆ ఇంటి యజమాని చెప్పే మాట ఇది. అవసరాన్ని మించి ఖర్చు చేసినపుడు ఇలాంటి మాటలొస్తుంటాయి. కానీ.. ఇప్పుడు అలా అనుకోడానికి లేదు. అవసరం కోసం ఖర్చు చేయాలన్నా.. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండటం లేదు. ఉదాహరణకు నెలకు రూ.30 వేలు జీతానికి పనిచేసే వ్యక్తికి నలుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం గుర్రం మీద స్వారీనే అని చెప్పాలి.


ఉదయం లేస్తే.. టీలు, టిఫిన్లు, కాఫీలు, సాయంత్రం స్నాక్స్.. ఇవన్నీ దాదాపు బయటి ఖర్చులే. మధ్యాహ్నం లంచ్, నైట్ కి డిన్నర్ కావాలంటే ఇంట్లో వండుకుంటారనుకుందాం. పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, స్కూల్ ఫీజులు.. వాళ్లకి నచ్చిన డ్రెస్సులు, నచ్చిన ఫుడ్, అప్పుడప్పుడు అవుటింగ్.. ఇలా చాలా ఖర్చులుంటాయి. ఇన్ని ఖర్చుల్లో.. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలన్నా జరగని పని. వాటిలో మొదటిది నిత్యావసర వస్తువులు.

ఇంటిల్లిపాది కడుపునిండా తినాలంటే నెలకు సరిపడా సరకులు తప్పనిసరిగా ఉండాలి. ఇక కూరగాయలైతే వారానికొకసారి తెచ్చిపెట్టుకుంటారు. రూ.10 కి, రూ.20కి కిలోల కూరగాయలొచ్చే రోజులు పోయాయి. పోని రూ.100 పెడితే నాలుగు రకాల కూరగాయలైనా వస్తాయా అంటే.. అదీ లేదు. ఒక రకం కేజీ కొనాలంటే రూ.100 వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. నాలుగైదు రకాలు కొనాలంటే రూ.400-రూ.500 వరకూ ఖర్చు చేయాలి. ఒక వారంరోజులకు సరిపడా కావాలంటే.. రూ.800 వందలైనా కూరగాయలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.


Also Read: రోగికి “అదుర్స్” సినిమా చూపిస్తూ.. అరుదైన సర్జరీ చేసిన డాక్టర్లు

అసలు కూరగాయల ధరలకు ఎందుకు రెక్కలొచ్చాయి. తగ్గినట్టే తగ్గి.. అమాంతం పెరిగిపోవడం వెనుక ఉన్న కారణాలేంటో చూస్తే.. ప్రధానంగా కనిపిస్తున్నది వరదలు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల కారణంగా చాలా వరకూ పంటలు దెబ్బతిన్నాయి. పూత, పిందల మీద ఉన్న మొక్కలు నీట మునిగి కుళ్లిపోయాయి. టమాటా, సొరకాయ, దోసకాయ, దొండకాయలు, బెండకాయలు, వంకాయలతో పాటు.. ఆకుకూరలు వేసిన పంటలు కూడా వర్షార్పణమయ్యాయి. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజార్లలో కంటే.. ప్రైవేటు మార్కెట్లలో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. కొత్తిమీర కట్ట అయితే.. ఒకటి రూ.80 నుంచి రూ.100 వరకూ పలుకుతోంది. కార్తీకమాసం ముందునుంచే మార్కెట్లలోకి వచ్చే చిక్కుడు కాయల ధర కిలో రూ.40 నుంచి రూ.80కి చేరింది. ఆకుకూరలు రూ.20కి నాలుగైదు కట్టలు వచ్చేవి కాస్తా.. ఇప్పుడు రెండే ఇస్తున్నారు. తెలంగాణలో ఉన్న నగరాలతో పాటు.. ఏపీలో ఉన్న ప్రధాన నగరాల పరిస్థితి కూడా ఇదే.

కూరగాయలతో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. జేబుకు చిల్లు పడుతుందని, సేవింగ్స్ ఉండటంలేదని వాపోతున్నారు వినియోగదారులు. ధరలు పెరగడమే కానీ.. తమ జీతాలు మాత్రం పెరగట్లేదని.. ఇలాగైతే ఏం కొనాలి, ఏం తినాలని పెదవి విరుస్తున్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×