EPAPER

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Financial Assistance to Journalist: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటూ తన మానవీయతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది. వైద్య సహాయం విషయంలోనైతే గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా హెల్ప్ చేస్తూ ఉంది. అయితే, ఇదే ఉదారభావాన్ని కూడా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజంలో కీలక పాత్రను పోషిస్తుంటారు జర్నలిస్టులు. నిరంతరం జన సంక్షేమమే ధ్యేయంగా ముందుకువెళ్తూ వార్తలు రాస్తుంటారు. అయితే, తాజాగా ఓ సాక్షి జర్నలిస్టుకు ఊహించని విధంగా ఆపత్కాలం ఎదురైంది. జర్నలిజం వృత్తిని కొనసాగిస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురయ్యారు. అతను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆయనకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించి మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది.


Also Read: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

అయితే, ఢిల్లీలో సాక్షి రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కేవీఎన్ఎస్ఎస్ ప్రకాశ్ కు అనుకోకుండా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు చెప్పారు. ఈ విషయం తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఢిల్లీలోని మిగతా రిపోర్టర్లతో మాట్లాడి తక్షణమే స్పందించారు. వెంటనే ప్రకాశ్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షలను మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.


ముందుగా ఈ విషయాన్ని హైదరాబాద్ లో పనిచేస్తున్న రిపోర్టర్లు రాష్ట్ర వైద్యమంత్రి దామోదర రాజనర్సింహా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి.. ఢిల్లీలో పనిచేస్తున్న రిపోర్టర్లతో ఫోన్ లో మాట్లాడి ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రకాశ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇటు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షలతోపాటు తాను కూడా వ్యక్తిగతంగా రూ. లక్ష సాయం చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షలను ప్రకాశ్ బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయనున్నట్లు వైద్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

Also Read: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

రాష్ట్రంలోని జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు. జర్నలిస్టులకు సంబంధించి ఇండ్ల స్థలాల అంశం కూడా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉందన్నారు. అయితే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకుని పరిష్కరించిందని మంత్రి దామోదర గుర్తుచేశారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×