EPAPER

Devara: అరుదైన ఫీట్ అందుకున్న దేవర..అందులో ఫస్ట్ ఇండియన్ మూవీ గా..!

Devara: అరుదైన ఫీట్ అందుకున్న దేవర..అందులో ఫస్ట్ ఇండియన్ మూవీ గా..!

Devara.. కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం దేవర (Devara ) . ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. అమెరికాలో సెప్టెంబర్ 26న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ ప్రీమియర్ షోలకి భారీగా టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా దేవర సినిమా జోరు చూపిస్తోంది. అయితే ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ప్రేక్షకుల దేవర మూవీ బుకింగ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డును సృష్టించబోతుందని సమాచారం.


డి బాక్స్ టెక్నాలజీ..

దేవర సినిమా యూఎస్ తో పాటు యూకే, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాలలో కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయా దేశాలలో సెటిల్ అయినా ఎన్నారైలు ఇండియన్ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా విదేశాలలో తెలుగు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు నార్త్ అమెరికాలో రిలీజ్ అయినన్ని థియేటర్స్ లో.. మిగిలిన దేశాలలో కూడా ఇండియన్ సినిమాలు విడుదల కాకపోవచ్చు. కానీ యూఎస్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియాలో మన ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవరా సినిమా ఆస్ట్రేలియాలో కొత్త రకమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో డి బాక్స్ టెక్నాలజీ ఉన్న కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో మాత్రమే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారట.


Devara: Devara received a rare feat..in it as the first Indian movie..!
Devara: Devara received a rare feat..in it as the first Indian movie..!

రేర్ ఫీట్ అందుకోనున్న దేవర..

ఇందుకోసం డి బాక్స్ టెక్నాలజీ కి సరిపోయే విధంగా దేవరా సినిమా అవుట్ పుట్ మాస్టరింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పర్టికులర్ గా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో మాత్రమే ఈ డి బాక్స్ టెక్నాలజీలో దేవర ను చూసే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్స్ లో సినిమాను చూస్తే ప్రేక్షకులు నేరుగా సినిమా ప్రపంచంలో కెళ్ళిపోతారట. వారి కళ్ళముందే జరుగుతున్నట్లు సినిమాలో దృశ్యాలు వారికి కనిపిస్తాయట. ముఖ్యంగా డీ బాక్స్ టెక్నాలజీ 3డీకి అడ్వాన్స్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు ఈ టెక్నాలజీలో ఉన్న థియేటర్స్ లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. అందుకే దేవర మాత్రం డి బాక్స్ టెక్నాలజీలో ప్రదర్శితమవుతున్న మొదటి సినిమాగా రేర్ ఫీట్ ని అందుకోబోతోంది. మరి ఈ డీ బాక్స్ టెక్నాలజీ థియేటర్స్ లో దేవర సినిమా ఎలాంటి అనుభూతిని ఇస్తుంది అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమా వీక్షించిన ఆడియన్స్.. ఆ ఫీలింగ్ పంచుకుంటే తప్ప తెలియదని చెప్పవచ్చు

సినిమా ప్రమోషన్స్..

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం గట్టిగానే జరుగుతున్నాయి. ఎన్టీఆర్ తో పాటు దేవర చిత్ర బృందం మొత్తం చెన్నైలో సినిమా ప్రమోషన్స్ లో ఉంది. దీనికి తోడు తమిళంలో కూడా ఈ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడ్డారు. చెన్నై తర్వాత బెంగళూరుకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ 27వ తేదీన ప్రారంభం కానున్న ఈ చిత్రం అర్ధరాత్రి 1:00 గంట నుండే షో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×