EPAPER

Ysrcp Leaders Missing: సాయం లేదు.. సమాచారం లేదు.. వరదల్లో మిస్సయ్యరా?

Ysrcp Leaders Missing: సాయం లేదు.. సమాచారం లేదు.. వరదల్లో మిస్సయ్యరా?

Ysrcp Leaders Missing: ఏపీలో రాజకీయాలంటే.. ముందుగా బెజవాడ నేతలే గుర్తొస్తారు. ప్రస్తుతం మచ్చుకైనా కనిపించలేదెందుకు? వైసీపీ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా? ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని భావించిన నేతలే ఇరుకున పడ్డారా? పదేళ్లు విజయవాడ సెంట్రిక్‌గా రాజకీయాలు సాగాయి. చంద్రబాబు సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నేతల నోటి మాట కాదు కాదా, కనిపించిన సందర్భం లేదు. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది?


 

ఆ నేతలెక్కడ?

వైసీపీ ప్రభుత్వం ఓ వెలుగు వెలిగారు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు. టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడేవారు. బూతు పురాణం మొదలుపెట్టారనుకోండి. ఆ జిల్లాలో ఒక్క నేత కూడా కనిపించలేదు. వారిలో పేర్ని నాని (అప్పుడప్పుడు కనిపిస్తున్నారు), వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. కనీసం బెజవాడ వరదల సమయంలో వీళ్ల జాడ కనిపించలేదు. అధినేత జగన్ ఇచ్చిన సలహాను ఫాలో అవుతున్నారా? కావాలనే వీళ్లంతా రాజకీయాలకు దూరంగా ఉన్నారా? ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


 

అప్పట్లో అలా..?

రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొద్దిరోజులు హింస.. మరి కొద్దిరోజులు హింస. అఫ్‌కోర్స్.. వైసీపీలో ఇప్పుడు అదే జరుగుతోందనుకోంది. జగన్ సర్కార్‌లో పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి నేతలంతా మంత్రులుగా కొనసాగారు. ఒకరిద్దరు తప్పితే.. ఆ సమయంలో ఆయా నేతలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. అవినీతి అనేది కాసేపు పక్కనబెడదాం. కనీసం టీడీపీ నేతలు రోడ్ల మీదకు రాకుండా పోలీసుల ద్వారా అణిచివేశారు.

 

ప్రజలకు దూరంగా..?

చంద్రబాబు సర్కార్‌లో అలాంటిదేమీ లేవుగానీ.. చాలామంది వైసీపీ నేతలు బయటకు రావడానికి వణుకుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కారణం ఏమైనా కావచ్చు. కనీసం తమ నియోజకవర్గంలో ప్రజలు నీటిలో మునిగిపోతున్నా, ఏ ఒక్కరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. బెంగుళూరు నుంచి వచ్చిన ప్రతీసారి అధినేత జగన్ మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు.

ALSO READ: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఈ నిర్ణయాలపై ఆమోదం..

ఇంతకీ ఆయా నేతలు ఆ పార్టీలో ఉన్నారా? మిగతా పార్టీల వైపు చూస్తున్నారా? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను వెంటాడు తున్నాయి. చాలామంది నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. ఇప్పుడు అవే వారిని వెంటాడుతున్నాయి. అరెస్టుల భయానికి దూరంగా ఉంటున్నారు. ఈ లెక్కన ఆయా నేతలు తప్పు చేసినట్టేనని ఒప్పుకున్నట్లయ్యింది. ఈ క్రమంలోనే ఆయా నేతలు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

 

అప్పుడు.. ఇప్పుడు బొత్సదే హవా?

పార్టీలో ఏదైనా విషయంపై మాట్లాడినప్పుడు కేవలం బొత్స సత్యనారాయణను ముందు పెడుతుంది ఆ పార్టీ. ఇప్పుడు అదే చేస్తోంది. బెజవాడలో అంతమంది వైసీపీ నేతలుండగా, వరద సాయంపై బొత్స రంగంలోకి దించింది ఆ పార్టీ. దీనిపై రకరకాలుగా చర్చించుకోవడం కృష్ణా జిల్లా వాసుల వంతైంది. రాబోయే ఐదేళ్లు ఇలాగే కంటిన్యూ అవుతారా? లేక బయటకు వస్తారా? అనే డౌట్ చాలామందిని వెంటాడుతోంది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×