EPAPER

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

CID Shakuntala.. సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఛాయలు అభిమానులను అతలాకుతలం చేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సిఐడి ధారావాహికతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నటి శకుంతల ( Actress Shakuntala) తాజాగా తుది శ్వాస విడిచారు. ఈమె మరణంతో అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈమె మరణానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా ఆరా తీస్తూ ఉండడం గమనార్హం.


సిఐడి శకుంతల అలాగే కన్నుమూత..

CID Shakuntala: Tragedy in the industry.. CID Shakuntala passed away..!
CID Shakuntala: Tragedy in the industry.. CID Shakuntala passed away..!

84 సంవత్సరాల వయసున్న దక్షిణాది నటి సిఐడి శకుంతల బెంగళూరులో ఛాతీ నొప్పి రావడంతో నిన్న తుది శ్వాస విడిచినట్లు సమాచారం. తెలుగు , తమిళ్, కన్నడ , మలయాళం భాషలో దాదాపు 600కు పైగా సినిమాలు, అలాగే సీరియల్స్ లో నటించిన ఎంజిఆర్, శివాజీ గణేషన్ వంటి లెజెండ్రీ నటులతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక శకుంతల మరణ వార్త విని అభిమానులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు.


డాన్సర్ గా కెరియర్ మొదలు..

డాన్సర్ గా సినీ రంగ ప్రవేశం చేసిన శకుంతల 1996లో నేతాజీ, 1963 లో నా వనంగుం గోడు , 1964 లో వచ్చిన కాయ్ కొడుకు గోడు వంటి ప్రసిద్ధ చిత్రాలతో పేరు సొంతం చేసుకుంది. ఇక 1970లో విడుదలైన సిఐడి తర్వాత ఈమెను అందరూ సిఐడి శకుంతల అని పిలవడం మొదలుపెట్టారు. ఇక శకుంతల చివరిగా 1998లో వచ్చిన పొన్మనై పేచీ వంటి సినిమాల్లో చివరిగా నటించింది. ఇక 2019 వరకు అనేక టెలివిజన్ సీరియల్స్ లో చురుకుగా పనిచేసిన ఈమె, ఆ తర్వాత వయసు మీద పడడంతో ఇండస్ట్రీకి దూరమైంది. చాలా కాలం పాటు ఇంటికే పరిమితమైన శకుంతల తాజాగా తుది శ్వాస విడిచినట్లు సమాచారం.

శకుంతల కెరియర్..

ఈమె ప్రారంభ జీవిత విషయానికి వస్తే, ఈమె స్వస్థలం సేలంలోని అరిసిపాళయం. ఈమె తల్లిదండ్రులు సినిమాల ద్వారా ఇన్స్పైర్ అయ్యి పాత చిత్రమైన శకుంతలై చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పేరు పెట్టారు. ఈమె తండ్రి అరుణాచలం తిరువెరుంబూరు లో ఉద్యోగం చేసేవారు. ఇక తర్వాత శకుంతల చెన్నైలో లలితా, పద్మిని , రాగిణి హోస్టుగా చేసిన షోలో డాన్స్ నేర్చుకుంది. సూర్యన్ మెర్కేయం ఉతిక్కుమ్ అనే నాటకంలో నటించి , ఆ తర్వాత సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంది. వ్యాంప్ క్యారెక్టర్లలో కూడా నటించిన ఈమె విలన్ గా కూడా నటించింది. అంతేకాదు కొన్ని సినిమాలలో హీరోయిన్గా కూడా నటించి మెప్పించింది. 1960 లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె 2019 వరకు ఇండస్ట్రీలోనే కొనసాగింది. ఈమె కుటుంబ విషయానికొస్తే.. నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్న పెద్ద కుటుంబం వీరిది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×