EPAPER
Kirrak Couples Episode 1

Revanthreddy : కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి డేటా ఎత్తుకెళ్లారు.. డీజీపీ పోస్టు కోసమేనా ? : రేవంత్

Revanthreddy : కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి డేటా ఎత్తుకెళ్లారు.. డీజీపీ పోస్టు కోసమేనా ? : రేవంత్

Revanthreddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. కాంగ్రెస్ వార్ రూంపై దాడి చేసింది పోలీసులు కాదు గుండాలని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ డేటా అంతా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తన పాదయాత్ర కోసం , కర్నాటక ఎన్నికల కోసం తయారు చేసిన కార్యాచరణను ఎత్తుకెళ్లారని తెలిపారు. ఇతర పార్టీ నేతలపై వార్ రూమ్ నుంచే పోస్టింగ్ చేశారని ఫ్రూప్ ఉందా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని సీపీ సీవీ ఆనంద్ ఎలా చెప్తారు? అని నిలదీశారు. ఉత్తమ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మా నేతలు, నిపుణులపై పోలీసుల దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. సీఎంను మెప్పించాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పని చేస్తున్నారని ఆరోపించారు. ఇలా డీజీపీ పదవి పొందాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు.


కార్యాచరణ ఇదే..!
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో భారత్ జోడో యాత్రపై చర్చించామని తెలిపారు. తీర్మానాలు ఆమెదించుకున్నామన్నారు. హైకమాండ్ ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహించామన్నారు. ప్రాణహాని ఉందని హెచ్చరికలు ఉన్నా లెక్కచేయకుండా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జనవరి 3, 4 తేదీల్లో పార్టీ శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. అన్ని జిల్లాలకు ఇన్ ఛార్జ్ ల నియామకం చేపడతామన్నారు. హైకమాండ్ ఆదేశాలతో జనవరి 26 నుంచి పాదయాత్ర చేపడుతున్నానని రేవంత్ ప్రకటించారు.

ప్రజా సమస్యలపై పోరాటం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీకి 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ వెళ్లాలే కార్యక్రమాలు చేపడతామన్నారు. పోడు భూముల సమస్యలపై పోరాడతామన్నారు. ఓటరు జాబితాలో అవకతవకలపై నిలదీస్తామన్నారు. మోదీ, కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ రూపొందిస్తామన్నారు. సోషల్ మీడియా సాయంతో కేడర్ కు చేరువ అవుతామని తెలిపారు. బీఆర్ఎస్ ను గద్దె దించి ప్రజలు జీవితాల్లో మార్పు తెస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×