EPAPER

TTD: డిసెంబర్‌లో తిరుపతి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం తెలుసా..??

TTD: డిసెంబర్‌లో తిరుపతి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం తెలుసా..??

Srivari Seva tickets release dates: చాలామందికి తిరుపతి వెళ్లి అక్కడ శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొని ఉంటుంది. ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంటారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా కీలక ప్రకనట చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న బుధవారం రోజున విడుదల చేస్తామని చెప్పింది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామంటూ టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20 ఉదయం 10 గంటలకు వరకు నమోదు చేసుకోవొచ్చని సూచించింది. అది కూడా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, ఈ టికెట్లను పొందిన భక్తులు ఈ నెల 20 నుంచి 22 వరకు మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించినవారికే లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయంటూ టీటీడీ వెల్లడించింది.


Also Read: బ్రేకింగ్ న్యూస్.. ప్రతి ఇంటికీ రూ. 25 వేల ఆర్థికసాయం ప్రకటించిన ప్రభుత్వం

ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను కూడా ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నది. ఇటు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించి కూడా డిసెంబర్ నెలా కోటా టికెట్లను ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నది.


డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి కూడా ఆన్ లైన్ లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇటు దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఫ్రీ దర్శనం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది. అదేవిధంగా 24న డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేయనున్నది టీటీడీ.

ఇటు తిరుమల, తిరుపతిలో గదుల కోటా.. డిసెంబర్ నెలకు సంబంధించి కూడా ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.

Also Read: ఒక్క ‘సాక్షి’కే రూ.300 కోట్లా? అంటే ఐదేళ్లలో..? అయ్య బాబోయ్, జగన్ మామూలోడు కాదు!

ఇదిలా ఉంటే.. తిరుమల, తిరుపతి శ్రీవారి సేవా కోటా ఈ నెల 27న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. నవనీత సేవకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామంటూ వివరించింది. పరకామణి సేవకు సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×