EPAPER

Modi Healthy Diet: నరేంద్ర మోడీ ఇష్టంగా తినే ఆహారాలు ఇవే, అందుకే 74 ఏళ్ల వయసులో కూడా ఆయన అంత ఫిట్‌గా ఉన్నారు

Modi Healthy Diet: నరేంద్ర మోడీ ఇష్టంగా తినే ఆహారాలు ఇవే, అందుకే 74 ఏళ్ల వయసులో కూడా ఆయన అంత ఫిట్‌గా ఉన్నారు

Modi Healthy Diet: నరేంద్ర మోడీకి 74 ఏళ్ళు నిండిపోయాయి. ఆయన్ని చూస్తే మాత్రం ఫిట్‌గా, చురుకుగా కనిపిస్తారు. దీనికి కారణం ఆయన అనుసరించే ఆరోగ్యకరమైన జీవనశైలే. సమతుల్య పోషకాహారం తినడం, యోగా, వ్యాయామం చేయడం, పాజిటివ్‌గా ఆలోచించడం ఇదే అతడి ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి.


ప్రధాని మోడీని చూస్తే ‘వయసు కేవలం ఒక సంఖ్య’ అని మాత్రమే అనిపిస్తుంది. రోజుకు 12 గంటలకు పైగా పని చేసే సామర్థ్యం ఆయనలో ఉంది. అందుకే ఆయన డైట్, ఫిట్‌నెస్ సీక్రెట్లను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన డైట్ లో కచ్చితంగా రెండు ఆహారాలను తింటారు. అవి మునగాకుల పరాటా, కిచిడీ.

మునగాకుల పరాటాను మొరింగా పరాటా అంటారు. మునగాకుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది పిల్లలు, పెద్దలు కచ్చితంగా తినాల్సింది. మునగాకుల్లా విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, బీటా కెరటిన్, పొటాషియం నిండుగా ఉంటాయి. దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. మునగాకులను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. మోడీ మునగాకు పరాటాను వారానికి కనీసం రెండుసార్లు అయినా తినేందుకు ఇష్టపడతారు. అదే ఆయనలోని అధిక రక్తపోటును, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.


కిచిడి

ప్రధాని మోదీకి కిచిడి అంటే ఎంతో ఇష్టం. అతని ప్రధాన ఆహారంలో కిచిడి ఒకటి. ముఖ్యంగా గుజరాతీ కిచిడిని ఆయన చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా సులువుగా జీర్ణం అవుతుంది. రాత్రిపూట తినే కిచిడీలో మసాలాలు లేకుండా చేస్తారు. వివిధ రకాల కూరగాయలు, పప్పులతోనే ఈ కిచిడిని చేసి మోడీకి వడ్డిస్తారు.

ఉపవాసాలూ ఉంటారు

నరేంద్ర మోడీ ఉదయం తొమ్మిది గంటలకు అల్పాహారాన్ని తీసుకుంటారు. అలాగే అతని ఆహారంలో మిల్లెట్లు, కాయధాన్యాలతో నిండిన ఆహారాలు కూడా అధికంగానే ఉంటాయి. కేవలం ఆయన శాఖాహారాన్ని తీసుకుంటారు. పండగల సందర్భంగా ఉపవాసాలు కూడా ఉంటారు. ఈ పద్ధతులే 74 ఏళ్ల వయసులో కూడా అతనిని ఫిట్ గా ఉంచుతోంది.

Also Read: అమ్మాయిలూ.. మగాళ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే,డైలీ మీరు చెక్ చేయాల్సినవి ఇవే

డైలీ యోగా..

ప్రధాని మోడీ ప్రతిరోజూ కచ్చితంగా చేసే పని యోగా. ఉదయం లేచాక 45 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు, ధ్యానం, ప్రాణాయామాలు వంటివి చేస్తారు. ఇది అతని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి.

గడ్డిపై చెప్పులు లేకుండా నడక

మోడీకి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. సమయం దొరికితే చాలు చెప్పులు తీసేసి ఉత్త పాదాలతో గడ్డి పై నడిచేందుకు ఇష్టపడతారు. గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వాకింగ్ కూడా చేయడం అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రను వచ్చేలా చేస్తుంది. నొప్పి, మంట వంటివి రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మోడీ హెల్త్ ఫార్ములా ఫాలో అయిపోండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×