EPAPER

Sunil Gavaskar: బంగ్లాతో తస్మాత్ జాగ్రత్త: గావస్కర్

Sunil Gavaskar: బంగ్లాతో తస్మాత్ జాగ్రత్త: గావస్కర్

Former India opener Sunil Gavaskar spells warning about Bangladesh for team India : బంగ్లాదేశ్ చిన్న జట్టేకదాని.. తేలికగా చూడవద్దని భారత లెజండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నయ్ వేదికగా మరో రెండురోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో కుర్రవాళ్లున్నారు. వారు అంతర్జాతీయంగా పేరు సంపాదించుకునేందుకు తహతహలాడుతున్నారని అన్నాడు.


నేను కొహ్లీ వికెట్ తీశాను. లేదా రోహిత్ శర్మని అవుట్ చేశానని గర్వంగా చెప్పుకోవాలని వారందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారని తెలిపాడు. గతంలో ఎదురైన పరాభావాలను కూడా గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. 2022లో బంగ్లాదేశ్ పర్యటనకు టీమ్ ఇండియా వెళ్లినప్పుడు, తొలి టెస్టులో ఇలాగే చావు తప్పి కన్నులొట్టపోయిందని అన్నాడు. ఓటమి ముంగిట వరకు వెళ్లి పరువు కాపాడుకున్నట్టు గుర్తు చేశాడు.

తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడినట్టు ఆడి పరువు తీయవద్దని గట్టిగానే హెచ్చరించాడు. దులీప్ ట్రోఫీలో చాలామంది ఫాస్ట్ బౌలర్లు ఆడలేదు. సీనియర్ క్రికెటర్లు ఆడలేదు. వారిని డైరక్టుగా తొలి టెస్టులోకి తీసుకున్నారు. ఇది సరైన విధానం కాదని . వారికి కూడా ప్రాక్టీస్ కావాలని పేర్కొన్నాడు. భారత జట్టులో ఆడే ప్రతి ఒక్కరు రంజీ, దులీప్ ట్రోఫీల్లో ఆడాలని తెలిపాడు. అప్పుడే వారి ఆటతీరు, టెక్నిక్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని అన్నాడు.


లేదంటే ఫస్ట్ టెస్టు ఫలితం తర్వాత అంచనాకి వచ్చి, అప్పుడు బాధపడితే ప్రయోజనం లేదని తెలిపారు. ఇక సీనియర్ క్రికెటర్లు కూడా గావస్కర్ చెప్పిన మాటలే చెబుతున్నారు. బంగ్లాదేశ్ ను తక్కువగా అంచనా వేయవద్దని అంటున్నారు. స్వదేశంలో రెండు టెస్టులు ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ కి తెలిసింది. మనకి అలాంటి అనుభవాలు రాకూడదంటే వళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందేనని పేర్కొంటున్నారు.

Also Read: నీరజ్ చోప్రాని ఫోన్ నెంబర్ అడిగిన అమ్మాయి.. ఏం చేశాడో తెలుసా?

రాబోవు రోజుల్లో టీమ్ ఇండియా 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఇవే అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇందులో కనీసం 5 టెస్టు మ్యాచ్ లు గెలిస్తేనేగానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడే అవకాశం ఉండదు. ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న బంగ్లాదేశ్ సిరీస్, ఇంకా న్యూజిలాండ్ సిరీస్ చాలా ముఖ్యమని అంటున్నారు.

తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు ఆ దేశానికి వెళ్లనుంది. అక్కడ వారిని ఓడించడం అంత ఈజీ కాదు. అందువల్ల ఇక్కడ బంగ్లా, కివీస్ ని ఓడిస్తే ప్రశాంతంగా ఆస్ట్రేలియా వెళ్లవచ్చునని అంటున్నారు. కానీ ఎప్పుడు టెన్షన్ పడుతూ, భారతీయులకు టెన్షన్ పెడుతూ వెళ్లడం టీమ్ ఇండియాకు సర్వసాధారణమైపోయింది. అందువల్ల ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×