EPAPER
Kirrak Couples Episode 1

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే కూలిన వంతెన..

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే కూలిన వంతెన..

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే వంతెన కూలిపోయింది. అట్లుంటది మరి మన ఇంజినీర్లు, కాంట్రాక్టుల పనితనం. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా నిర్మిస్తే ప్రారంభానికి ముందేం కర్మ కట్టకముందే కూలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. బిహార్‌లో ఓ బ్రిడ్జి ఇలానే ప్రారంభానికి ముందే కుప్ప కూలిపోయింది. బ్రిడ్జిపై వాహనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.


బిహార్​లోని బెగూసరాయ్​లో గండక్​ నదిపై 2017లో ఈ వంతెనను నిర్మించారు. మా భగవతి సంస్థ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి 13 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల.. ఈ వంతెనకు ప్రారంభోత్సవం నిర్వహించలేదు. ఆఫీషియల్‌గా ఇంకా ప్రారంభించకపోయినా బ్రిడ్జిపై వాహన రాకపోకలు మత్రం సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మించి ఐదేళ్లు కూడా కాకముందే కుప్పకూలిపోయింది.

ఆ సమయంలో వంతెనపై వాహనాలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించిన కాంట్రాక్టర్​ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు.


Tags

Related News

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Book My Show black Tickets: చిక్కుల్లో ‘బుక్ మై షో’ సీఈవో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మినందుకు సమన్లు

Big Stories

×