తాటిబెల్లంతో పోషకవిలువలతో పుష్కలం

తాటిబెల్లంలోని ఖనిజలవణాలు చక్కెరతో పోలిస్తే 60 రెట్లు ఎక్కువ.

నెలసరి సమస్యలతో సహా పలురకాల అనారోగ్యాలను దూరం చేస్తుంది.

జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

తాటిబెల్లంలోని ఇనుము, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతాయి. దీంతో రక్తహీనత ఉండదు.

యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మాన్ని కాపాడతాయి. కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి.

అధిక బరువు సమస్యలకు చెక్‌ పెడుతుంది.

మైగ్రేన్‌ వచ్చినప్పుడు నోట్లో చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది.

పొడిదగ్గు, జలుబు వంటివాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది.

ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తమాకీ దూరంగా ఉండొచ్చు.