ముఖంపై రంధ్రాలను తొలగించే సింపుల్ చిట్కాలు ఇవే!

కొందరిలో ముఖంపై ఏర్పడిన మొటిమలు కారణంగా రంధ్రాలు ఏర్పడుతుంటాయి. వీటి కారణంగా చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. ఇందుకోసం కొన్నిచిట్కాలు పాటించండి.

అరటి తొక్క అరటి తొక్క ముఖంపై రంధ్రాలను తొలగించడంలో సహాయపడతాయి. అరటి తొక్కను ఫేస్‌పై 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత  గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ఈ సమస్య తొలగిపోతుంది.

కీరదోస కీరదోస ముఖంపై రంధ్రాలు తొలగించేందుకు తోడ్పడతాయి. కీరదోసలో సిలికా అధికంగా ఉంటుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

క్యారెట్ క్యారెట్ గుజ్జులో టీస్పూన్ పాలు, టీస్పూన్ తేనె కలిపి ముఖంపై అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా అలోవెరా జెల్‌లో చిటెకెడు పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగండి. కొద్ది రోజులకి ముఖంపై రంధ్రాలు తొలగిపోతాయి.

బొప్పాయి బొప్పాయిలో యాంటీ ఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రంధ్రాలను తొలగించడంలో సహాయపడతాయి.

ముల్తానీ మట్టి ముల్తాని మట్టి ముఖంపై రంధ్రాలను తొలగించడంలో సహాయపడతాయి. ముల్తానీ మట్టిలో  రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.