EPAPER

Gas Burner Cleaning Tips: గ్యాస్ బర్నర్ మురికిగా మారిందా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మెరుస్తుంది

Gas Burner Cleaning Tips: గ్యాస్ బర్నర్ మురికిగా మారిందా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మెరుస్తుంది

Gas Burner Cleaning Tips: ప్రస్తుతం ప్రతి ఇంట్లో వంటలు చేయడానికి గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అయితే నిరంతర ఉపయోగం కారణంగా వాటి బర్నర్ చాలా తక్కువ సమయంలోనే మురికిగా మారుతుంది. అలాంటి సమయంలోనే అపరిశుభ్రంగా మారిన బర్నర్‌ను కొన్ని సులభమైన పద్ధతులతో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. వీటితో కొత్త దానిలా క్షణాల్లోనే బర్నర్ మెరిసిపోతుంది.


ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ విరివిగా వినియోగిస్తారు. గ్యాస్ బర్నర్స్ నిరంతర ఉపయోగం కారణంగా తరచుగా మురికిగా మారుతాయి. గ్యాస్ బర్నర్‌ను చాలా కాలం పాటు శుభ్రం చేయకుండా ఉంటే దానిపై ధూళి, జిడ్డు పేరుకుపోతుంది. అంతే కాకుండా బర్నర్ నల్లగా కూడా మారుతుంది. బర్నర్ పై పేరుకుపోయిన మరికి వాటిపై ఉన్న రంధ్రాలకు అడ్డుపడతాయి. దీంతో మంట సరిగ్గా పైకి రాదు .

ఇటువంటి సమయంలోనే గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడం అవసరం. చాలా మందికి, గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. ఎలా శుభ్రం చేయాలో తెలియని వారు కూడా చాలా మందే ఉంటారు. ముఖ్యంగా గ్యాస్ బర్నర్ సరిగ్గా శుభ్రం చేయకపోతే అది త్వరగా పాడవుతుంది. కానీ కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా ఇంట్లోనే గ్యాస్ బర్నర్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.


గ్యాస్ బర్నర్ శుభ్రపరిచే పద్ధతులు..

కావలసినవి:
వేడి నీరు
డిష్ వాష్ బార్, లిక్విడ్ డిటర్జెంట్
పాత టూత్ బ్రష్
స్పాంజ్
లెమన్
బేకింగ్ సోడా
వెనిగర్

శుభ్రం చేయు విధానం..
ముందుగా, గ్యాస్‌ను ఆపివేసి, బర్నర్‌ను చల్లబరచండి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొద్దిగా గిన్నెలు శుభ్రం చేసే సబ్బు ముక్క కాస్త వేయండి . లేదంటే మీరు ఒక వేళ లిక్విడ్ వాడుతున్నట్లయితే కనక లిక్విడ్ వేయండి. ఆ తర్వాత ఈ నీటిలో బర్నర్‌ను 15-20 నిమిషాలు ముంచండి. ఆ తర్వాత అందులో నుంచి తీసి పాత టూత్ బ్రష్ సహాయంతో మురికిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల బర్నర్ తెల్లగా మారుతుంది. మురికి మొత్తం తొలగిపోతుంది.

నిమ్మకాయ, ఉప్పు: నిమ్మకాయను సగానికి కట్ చేసి ఆ తర్వాత దీనిపై ఉప్పు వైసి బర్నర్‌ను రుద్దండి. నిమ్మకాయలో ఉండే యాసిడ్ , ఉప్పు యొక్క గరుకుగా ఉండే గుణం బర్నర్ ఉపరితల మలినాన్ని సులభంగా తొలగిస్తుంది. దీంతో ఈజీగా బర్నర్ తెల్లగా మారుతుంది. ఆ తర్వాత బర్నర్ ను నీటిలో కడిగి ఆరబెట్టండి.

బేకింగ్ సోడా, నీరు: ఒక బౌల్ తీసుకుని అందులో కాస్త బేకింగ్ సోడా, నీరు వేసి బాగా కలపండి. పేస్ట్ లాగా చేసిన ఈ మిశ్రమాన్ని బర్నర్‌పై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఉంచండి . తర్వాత స్పాంజితో కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంతో బర్నర్ మెరిసిపోతుంది.

వెనిగర్: కాస్త వెనిగర్‌ను ఒక బౌల్‌లో వేసుకుని అందులోనే స్పాంజిని ముంచి ఆ తర్వాత దానితో బర్నర్‌ను శుభ్రం చేయండి. వెనిగర్ ఒక సహజమైన క్లీనర్, ఇది మురికిని సులభంగా తొలగిస్తుంది. దీనితో, గ్యాస్ బర్నర్ సులభంగా శుభ్రం అవుతుంది. ఫలితంగా బర్నర్ మెరిసిపోతుంది.

బర్నర్ నాజిల్‌ను శుభ్రపరచడం: బర్నర్ నాజిల్‌ను తీసివేసి, నీరు, డిటర్జెంట్ ద్రావణంలో ముంచండి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో శుభ్రం చేసి ఆరబెట్టండి.

AlSO  Read: తేనె తింటే మంచిదే, కానీ దానిలో ఈ పదార్థాలు కలుపుకొని తింటే మాత్రం ప్రమాదం

మరి కొన్ని చిట్కాలు:
మురికి పేరుకుపోకుండా బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.
వంట చేసేటప్పుడు బర్నర్ చుట్టూ మురికి వ్యాపించకుండా అల్యూమినియం ఫాయిల్‌ను బర్నర్ క్రింద ఉంచవచ్చు.
బర్నర్ చాలా మురికిగా ఉంటే కనక మార్కెట్లో లభించే బర్నర్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు.

జాగ్రత్తలు..
బర్నర్‌ను శుభ్రపరిచే ముందు, గ్యాస్‌ను ఆపివేసి, బర్నర్‌ను చల్లబరచండి
బర్నర్‌ను శుభ్రపరిచేటప్పుడు చేతి గ్లౌజ్ లను ఉపయోగించండి
బర్నర్ నాజిల్‌లను శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×