EPAPER

Anchor Syamala: పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!

Anchor Syamala: పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!

Anchor Syamala: యాంకర్ శ్యామలా.. ఇప్పుడు వైసీపీ శ్యామల. ఆ పార్టీకి అధికార ప్రతినిధి. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా.. అది వైసీపీ వాక్కే. అదేంటీ.. ఆమెకు ఏం రాజకీయ అనుభవం ఉందని ఆ పదవి ఇచ్చారని సొంత పార్టీవాళ్లే ఆశ్చర్యపోయారు. టంగ్ పవర్ ఉంటే.. రాజకీయ అనుభవంతో పనేముంది అనేదే వైసీపీ పెద్దల ఉద్దేశం కాబోలు. అంతేకాదు.. ఆమెకు ఆ పదవి కట్టబెట్టడం వెనుక పెద్ద కథ.. స్క్రీన్‌ప్లే ప్లానింగే ఉంది. 


జగన్ శ్యామలకు పార్టీ అధికార ప్రతినిధిగా ఎందుకు బాధ్యత అప్పగించారో.. ఆమెకున్న రాజకీయ అనుభవం ఏమిటో.. ఆమెకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారో చాలా మందికి అంతుపట్టడం లేదు. కానీ జగన్ స్కెచ్ మాత్రం మామూలుగా లేదు. యాంకర్ శ్యామలకు ఆ కీలక పదవి ఇవ్వడం ద్వారా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టొచ్చు. అదెలాగంటే శ్యామలపై అసలే గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు నోరు జారి ఏదైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మహిళలపై వారికున్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించవచ్చు. ‘ఉమెన్ కార్డ్’ కూడా వాడేయొచ్చు. జనాల్లో బోలెడంత సింపతీని పొందేయవచ్చు. అలాగే ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వాళ్లను కేసులలో ఇరికించవచ్చు. అటు ప్రజలలో సింపతీ.. ఇటు కేసులు.. రెండు కోణాలలో జగన్ ఆలోచిస్తున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రోజాతో సరిసమానమైన హోదాని శ్యామలకు కట్టబెట్టడం వెనుక కారణం ఇదే అంటున్నారు.

రోజా సైడయ్యారా?


గతంలో టీడీపీ శ్రేణులు శ్యామలను టార్గెట్ చేసిన విషయం విదితమే. రోజాని టార్గెట్ చేస్తూ టీడీపీ ఇటీవల ఆమెపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ ప్రోగ్రాం కింద విడుదలైన నిధులను రోజా దుర్వినియోగం చేశారని ఆమెపై కేసు నమోదయింది. ఇప్పుడు రోజా గట్టిగా అధికార పక్షంపై విరుచుకుపడే ఛాన్స్ తక్కువ. అందుకే ఆమె పోస్టును భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా శ్యామల నియామకం జరిగినట్లు భావిస్తున్నారంతా. అయితే, రోజాతో శ్యామలాను పోల్చలేం. రోజాకు ఉన్నంత డేరింగ్ శ్యామలాకు ఉందా లేదా అనేది మున్ముందు తెలుస్తుంది. అయితే, వైసీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో.. శ్యామల ఎన్నికల ప్రచారంలో తన స్థాయిని దాటి మరీ వ్యాఖ్యలు చేసిందనే విమర్శలున్నాయి. వైసీపీ ఓటమితో ఆమె తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. చివరికి వీడియో కూడా రిలీజ్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది. తన కెరీర్‌కు పుల్ స్టాప్ పడకూడదని జాగ్రత్తపడింది. అయితే, తాజా పదవితో ఆమె కెరీర్‌కు పూర్తిగా బ్రేకులు పడినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మొదట్లో సపోర్ట్.. ఆ తర్వాత ప్రచారం..

రాజకీయాలలో ఎంటరై.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచార పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికలలో ప్రచారం కన్నా వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు శ్యామల. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి శ్యామల చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు శ్యామల. రాబోయే జగన్ ప్రభుత్వమే అన్నంత ధీమాగా దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

పెద్ద డ్రామానే నడిచింది

ఎన్నికలయ్యాక తనని ఫోన్ లో ఎవరో పనిగట్టుకుని బెదిరిస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ కార్యకర్తలతో తనకు ప్రాణహాని ఉందంటూ శ్యామల సోషల్ మీడియాలో ఇంకా సింపతీ కోసం పాకులాడుతూనే ఉన్నారు. ఎన్నికలలో జగన్ కు మద్దతు ఇచ్చిన కారణంగానే తనకు టీవీ అవకాశాలు లేకుండా చేశారని శ్యామల చెప్పుకున్నారు. రీసెంట్ గా శ్యామల బుడమేరు వరదల సాయం విషయంలో చంద్రబాబు అండ్ కో ని తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.

వస్తూనే యార్కర్.. కూటమి క్లీన్ బౌల్డ్…

అయితే ఇటీవల పార్టీ ఘోర ఓటమి తర్వాత జగన్ పార్టీని ప్రక్షాళన చేయడానికి నిశ్చయించుకున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామలను ఆఘమేఘాలమీద నియమించారు. అలా పదవి చేపట్టగానే శ్యామల రంగంలోకి దిగారు. ప్రజలకు సాయం చేయడంలో తమ నేత జగన్ ఎప్పుడూ ముందుంటారని.. అలాంటి జగన్ పిల్లికి కూడా బిచ్చం వేయని చంద్రబాబు, లోకేష్ లు విమర్శిస్తున్నారని.. వారిని చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని శ్యామల తీవ్ర స్థాయిలో విపక్షాలపై ధ్వజమెత్తారు. రెండు ఎకరాల స్థాయి నుంచి రూ.2 లక్షల కోట్లు సంపాదించుకున్న చంద్రబాబు నిజంగా తన జీవితంలో ఎంతమందికి సాయం చేశారని విరుచుకుపడ్డారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే  ఆమె యార్కర్ వేసే ప్రయత్నం చేశారు. కూటమి సపోర్టర్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు. అయితే, ఇది శాంపిల్ మాత్రమే.. టీడీపీ, జనసేనలు శ్యామలా కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుని ట్రోల్ చేస్తే.. ఉచ్చులో పడినట్లే. ఎంత విమర్శిస్తే.. ఆమెకు అంత మైలేజ్ పెరుగుతుంది. ఇదంతా వైసీపీ పెద్దల స్క్రీప్ట్. కథ, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం అంతా వాళ్లదే.. అని కూటమి సపోర్టర్స్ అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.

Also Read: కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేదు, ఒక్కదాన్నే పోరాడుతున్నాను.. కంగనా రనౌత్ ఎమోషనల్

శ్యామల ప్రయాణం.. అలా మొదలైంది

బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. యాంకర్ గా పలు షోలు నిర్వహించిన శ్యామల.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చిన్న వయసులోనే టీవీ ఇండస్ట్రీలో ప్రవేశించి మొదట్లో కొన్ని సీరియల్స్ కూడా చేశారు. కొంతకాలం సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహించారు. సీరియల్ నటుడు నరసింహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె భర్త నరసింహారెడ్డి చీటింగ్ కేసుపై అరెస్టయ్యారు. అతడిని కాపాడుకోవడం కోసమే.. శ్యామలా రాజకీయాల్లోకి అడుగు పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×