Khairatabad Ganesh Nimajjanam Live Updates: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు మొదలై.. నిమజ్జన ప్రాంతానికి చేరుకుంది. క్రేన్ నంబర్ 4 వద్దకు మహాగణపతి విగ్రహం చేరుకోగా.. ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మలో నిమజ్జనం చేశారు. భారీ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు చేసిన ఏర్పాట్లను అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
తుది పూజల అనంతరం గణపతిని గంగమ్మ ఒడికి చేర్చిన సూపర్ క్రేన్
నిమజ్జనానికి ముందు తుది పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి
నిమజ్జనంలో పాల్గొన్న క్రేన్ డ్రైవర్స్, సిబ్బందికి 3 షిఫ్టులు వేయాలని సీఎం ఆదేశం
మహాగణపతి నిమజ్జనానికి సూపర్ క్రేన్
ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకున్న గణనాథుడు
చివరిరోజున సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకుని.. గణేషుడి నామస్మరణ చేస్తున్న భక్తులు
భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతున్న మహాగణపతి శోభాయాత్ర
భక్తజన సంద్రంగా మారిన ట్యాంక్ బండ్ దారులు
బొజ్జగణపయ్య నిమజ్జనాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులు
క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
భక్తులకు మంచినీళ్లు, భోజన వసతి ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ
700 మంది పోలీసులతో భారీ బందోబస్త్
సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు ఖైరతాబాద్ మహా గణపతి