EPAPER

Brahmamudi Serial Today September 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న అపర్ణ – తాను పట్టించుకోనన్న చెప్పిన రాజ్‌

Brahmamudi Serial Today September 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న అపర్ణ – తాను పట్టించుకోనన్న చెప్పిన రాజ్‌

Brahmamudi serial today Episode : కావ్య ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయిందో.. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లిపోయిందో స్వప్న చెప్పడంతో అపర్ణ షాక్‌ అవుతుంది. నా చెల్లి ఆత్మాభిమానం చంపుకుని ఇక్కడ ఉండలేకే ఈ గడప దాటిందని స్వప్న చెప్పగానే అపర్ణ తూలి కింద పడబోతుంది. ఇంతలో రాజ్‌ పట్టుకుంటాడు. తేరుకున్న అపర్ణ.. కావ్య చేసింది మంచి పనేనని మెచ్చుకుటుంది. భర్త మనసులో ప్రేమ లేదని చెబితే నువ్వెంత నీ లెక్కెంత అని పౌరుషంతో వెళ్లిపోయింది. దటీజ్‌ కావ్య.. అంటుంది ఇంతలో రుద్రాణి కలగజేసుకుని మా అమ్మ అక్కడికి చెప్పింది వదిన.. రాజ్‌ ను క్షమాపణ అడగమని కానీ వినకుండా వెళ్లిపోయింది అనగానే.


కావ్య క్షమాపణ చెప్పి ఉంటే నేనే చెంప పగులగొట్టేదాన్ని: అపర్ణ

అయినా నా కోడలు ఏం తప్పు చేసిందని క్షమాపణ అడగమన్నారు అత్తయ్యా అంటూ.. అది మన సంస్థ ప్రతిష్ట కాపాడింది. మన గౌరవాన్ని కాపాడింది అటువంటిది క్షమాపణ ఎందుకు అడగాలి? అని అపర్ణ ప్రశ్నించడంతో .. నిజమే అపర్ణ.. కానీ వీడు తెగేదాకా లాగుతున్నాడు. ఈ రుద్రాణేమో అగ్నికి ఆజ్యం పోస్తుంది. కావ్య అన్నమాట మీదే నిలబడింది. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందోనని రాజీ కుదర్చడానికి ప్రయత్నించాను అంటుంది ఇందిరాదేవి. రాజీ కుదర్చడానికి అది మీ పెద్దకోడలు కాదు అత్తయ్య. అది నా కోడలు. నీతిగా నిజాయితీ బతికే నా కోడలు వీణ్ని క్షమాపణ అడిగి ఉంటే నేనే దాని చెంప పగులగొట్టేదాన్ని అంటుంది అపర్ణ.


కావ్య కోసం వెళ్తానన్న అపర్ణ

ఇంతలో రుద్రాణి వదిన ఆ కావ్య కూడా ఇలాగే నీతి నిజాయితీలు అంటూ నిన్ను బోల్తా కొట్టించింది. కంపెనీ నుంచి అసలు ఎలాంటి ఫోన్‌ రాలేదు. నిన్ను అలా నమ్మించింది. రాహుల్‌ ను ఆఫీసుకు వెళ్లకుండా చేసేందుకే ఇదంతా చేసింది అనగానే అపర్ణ కోపంగా రాహుల్‌ ఆనాడే కంపెనీకి వెళ్లనని తేగేసి చెప్పాడు. మళ్లీ కొత్తగా కంపెనీకి వెళ్లకుండా కావ్య ప్రయత్నం చేయడం ఏంటి? అని అపర్ణ అడగడంతో రుద్రాణి షాక్‌ అవుతుంది. అపర్ణ రాహుల్‌, రుద్రాణిని తిడుతుంది. అయినా ఇప్పుడు నీ మీద కూడా నాకు కోపం రావడం లేదు. చెప్పుడు మాటలు పట్టుకున్న నా కొడుకుదే తప్పు. అంటూ రాజ్‌ ను తిడుతుంది అపర్ణ. కావ్య మనసుకు గాయం చేసి పంపిచావు కదరా? అంటూ ఎమోషన్‌ అవుతుంది అపర్ణ. దీంతో రాజ్‌ నేనేం వెళ్లిపోమ్మనలేదు మమ్మీ అంటాడు. అయితే నాకోసమే ఇదంతా చేశావు కదా? ఇప్పుడు నేనే చెప్తున్నాను నువ్వు వెళ్లి నా కోడల్ని ఇంటికి తీసుకురా? అని అపర్ణ చెప్పినా రాజ్‌ వినడు. ఏ కారణం చేతనైనా కానీ కళావతి నిన్ను వదిలి వెళ్లకూడదు. అలాంటి మనిషిని నేను వెళ్లి తీసుకురాలేనని లోపలికి వెళ్లిపోతాడు. అయితే నేనే నా కోడలు దగ్గరకు వెళ్లి తీసుకోస్తాను అని అపర్ణ వెళ్లబోతుంటే సీతారామయ్య, ఇందిరాదేవి వద్దమ్మా నీ ఆరోగ్యం బాగాలేదు. ఈ రాత్రిపూట నువ్వు బయటకు వెళ్లితే మళ్లీ ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే మేము తట్టుకోలేము. రేపు ఉదయం మేము వెళ్లి కావ్యును తీసుకొస్తాము అని చెప్పడంతో అపర్ణ సరే అని లోపలికి వెళ్లిపోతుంది.

Also Read: ‘సీతే రాముడి కట్నం’ సీరియల్‌: మహాకు షాక్‌ ఇచ్చిన సీత – ఇల్లు తాకట్టు పెడతానన్న శివకృష్ణ

రాజ్‌ మనసు మార్చేందుకు రుద్రాణి ప్లాన్‌

తర్వాత రాహుల్‌ అపర్ణను తిడుతుంటాడు. మమ్మీ మీ వదినకు వేరే పనేం లేదా? ప్రతిసారి కావ్య కావాలి అంటుంది అంటూ చిరాగ్గా మాట్లాడటంతో.. ఆ కావ్య ఇంట్లో వాళ్లను అంతలా మాయ చేసిందిరా.. అంటుంది రుద్రాణి. కష్టపడి ఇంత ప్లాన్‌ చేసి ఆ కావ్యను ఇంట్లోంచి తరిమేసాం. ఇప్పుడు ముసలొళ్లు వెళ్లి కావ్యను తీసుకొస్తే మన ప్లాన్‌ ఫెయిల్ అవుతుంది కదా? వీళ్లను రేపు ఎలాగైనా ఆపాలి మమ్మీ అంటాడు రాహుల్‌. పిచ్చోడా.. వీళ్లు వెళ్లి పిలవగానే రావడానికి కావ్య మామూలు ఆడది కాదురా ఆత్మాభిమానం ఉన్న ఆడది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ పిలిచినా కావ్య రాదు అని రుద్రాణి చెప్పగానే అయితే ఎవరూ పిలిచినా రాదా మమ్మీ అంటాడు రాహుల్‌. ఎవ్వరూ పిలిచినా రాదు కానీ రాజ్ వెళ్లి పిలిస్తే మాత్రం వస్తుంది. కాబట్టి రాజ్‌ ఎప్పటికీ కావ్యను పిలవకుండా చేయాలి అని చెప్తుంది రుద్రాణి.

కృష్ణమూర్తి ఇంటికి వెళ్లిన దుగ్గిరాల ఇంటి పెద్దలు

మరుసటి రోజు ఉదయం ఇందిరాదేవి, సీతారామయ్య కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి కావ్యను రమ్మని పిలుస్తారు. ఇలా ఎన్నిరోజులని ఇంటికి నీ భర్తకు దూరంగా ఉంటావు. నువ్వు తిరిగి ఆ ఇంటికి రావాలని మేమందరం కోరుకుంటున్నాము అని చెబుతూ.. కనకం నువ్వు చెప్పు ఒక తల్లిగా నీ కూతురు అత్తారింట్లో ఉండాలని కోరుకోవడం లేదా నువ్వు? అని అడుగుతారు. కావ్య వస్తే ఈ క్షణమే మీతో పాటు తీసుకువెళ్లండి అని కనకం చెప్తుంది. కావ్య మాత్రం ఇన్‌ డైరెక్టుగా తాను రానని చెప్తుంది. మీరు కోరుకున్నట్లే ఆ ఇంటికి వస్తాను కానీ ఆ ఇంట్లో నా స్థానమేంటో నాకు చెప్పండి అంటూ ముసలొళ్లను కావ్య ప్రశ్నించడంతో వాళ్లు ఏమీ చెప్పలేక చూస్తుండిపోతారు. మరోవైపు ఇంట్లో వాళ్లందరూ ఇందిరాదేవి, సీతారామయ్య కోసం ఎదరుచూస్తుంటారు. ఇంతలో కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

 

Related News

Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతిని ఎదురించిన మీనా.. అడ్డంగా దొరికిన రోహిణి.. శృతి పెళ్లి డేట్ ఫిక్స్..

Satyabhama Serial Today September 19th: క్రిష్ ను కాపాడుకున్న సత్య.. నిజం తెలుసుకున్న మహదేవయ్య..

Trinayani Serial Today Episode: గాజులు దొంగిలించిన వల్లభ – తిలొత్తమ్మను ఓ ఆటాడుకున్న హాసిని

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరికి ధైర్యం చెప్పిన అమర్‌ – గుప్తకు హెల్ఫ్‌ చేసిన అరుంధతి

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కు జీతం ఇస్తానన్న కావ్య – రుద్రాణిని రాయబారానికి పంపాలన్న స్వప్న

Kirrak Couples Promo: భార్యను మోయలేకపోయిన ఆదిరెడ్డి, కంగారులో పెదవి కొరికిన షరీఫ్, ఈవారం ‘క్రిర్రాక్ కఫుల్స్‘ ప్రోమో అదుర్స్ అంతే..

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు ఘోర పూజలు – ఎలాగైనా కాపాడతానన్న గుప్త

Big Stories

×