EPAPER

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Tips For Skin Glow: ముఖం మెరుస్తూ అందంగా ఉండాలంటే సరైన పద్దతిలో ముఖాన్ని శుభ్రపరచడం అవసరం. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఫేస్ క్లీనింగ్ కూడా మిమ్మల్ని మరింత అందంగా మారుస్తుంది. అందుకే ఫేస్ క్లీనింగ్ పై శ్రద్ధ పెట్టాలి. లేకుంటే ఉన్న అందం కాస్త కోల్పోతారు.


చర్మ సంరక్షణ చిట్కాలు:
ప్రతి ఒక్కరూ భిన్నంగా కనిపించాలని కోరుకుంటారు. అలాంటి వారు ముఖం మెరిసేలా, ఆరోగ్యంగా కనిపించాలంటే.. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీంతో పాటు, ముఖ చర్మానికి సరైన సంరక్షణ కూడా అవసరం. చర్మాన్ని కాపాడుకోకపోతే నిర్జీవంగా మారుతుంది. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖాన్ని శుభ్రపరచడం వల్ల చర్మంపై మురికి, నూనె తొలగిపోతాయి.

ముఖం శుభ్రపరిచే పద్ధతులు..


ముందుగా మీ చర్మ రకాన్ని తెలుసుకోండి..

పొడి చర్మం ఉన్న వారు ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి మాయిశ్చరైజింగ్ క్లెన్సర్‌లను ఉపయోగించండి.

జిడ్డు చర్మం ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి జెల్ ఆధారిత లేదా ఫోమ్ క్లెన్సర్ ఉపయోగించండి.

సున్నితమైన చర్మం ఉన్న వారు హైపోఅలెర్జెనిక్, సువాసన లేని క్లెన్సర్‌లను ఉపయోగించండి.

ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు రోజుకు రెండుసార్లు మీ ముఖాన్ని కడగాలి. మేకప్ వేసుకున్న తర్వాత కూడా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

క్లెన్సర్‌ని ముఖానికి పట్టించి మసాజ్ చేయండి. కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని చాలా సున్నితంగా శుభ్రం చేయండి.

వేడి నీళ్లతో చర్మం పొడిబారుతుంది కాబట్టి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

టోనర్‌ని ఉపయోగించడం వల్ల చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా రంధ్రాలను మూసివేస్తుంది.

ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

వారానికి ఒకసారి స్క్రబ్ చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.

మేకప్ రిమూవర్‌తో మేకప్‌ను తొలగించి, ఆపై ముఖాన్ని కడగాలి.

కాటన్ క్లాత్‌తో ముఖాన్ని తుడవండి. పొడి టవల్‌తో అస్సలు తుడవకండి. ఇది చర్మంపై చికాకు కలిగిస్తుంది.

రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడకుండా ఉంటే మంచిది.

Also Read: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

వీటితో గ్లోయింగ్ స్కిన్..

తేనె: ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

పెరుగు: దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

ముల్తానీ మిట్టి: ముల్తానీ మిట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీనిని నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి.

ఓట్స్: ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. ఓట్స్ ను గ్రైండ్ చేసి అందులో నీరు కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×