EPAPER

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Throat Infection: ప్రస్తుత రోజుల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఒక్కోసారి చలి, ఒక్కోసారి ఉక్కపోత కలుగుతోంది. దీని కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తి పెరుగుతోంది. కాబట్టి జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో కొంచెం అజాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ సీజన్‌లో గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలు ఎక్కువవుతాయి. ఈ సీజన్‌లో వచ్చే ఇన్ఫెక్షన్‌లను సీరియస్‌గా తీసుకోవాలి. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకండి.


గొంతు నొప్పి 10 రోజులకు పైగా కొనసాగితే అది కూడా తీవ్రమైనదిగా బావించాలి. అలాంటి సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఈ సీజన్‌లో వచ్చే గొంతు ఇన్‌ఫెక్షన్‌ని సహజ పద్ధతి ఎదుర్కోవచ్చు. ముందుగా గొంతులో ఈ సమస్యకు కారణాలు ఏంటో తెలుసుకోవడం కూడా ముఖ్యం.

ముఖ్యంగా వర్షాకాలం ముగుస్తున్నప్పుడు, ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు, వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది. వాతావరణంలో ఉన్న తేమ కారణంగా, బ్యాక్టీరియా, వైరస్లు చాలా పెరుగుతాయి. ఈ సీజన్‌లో సాధారణ ఫ్లూ, కడుపు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉండటానికి కారణం కూడా ఇదే. ఈ గొంతు ఇన్ఫెక్షన్ ,నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ తక్షణ ఉపశమనం కోసం హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఒక వేళ మీరు కూడా గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లయితే వీటిని ట్రై చేయండి . ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడతారు


గొంతు నొప్పిని తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీస్‌ :

ఉప్పు నీరు:
బాక్టీరియా విపరీతమైన వేడిని తట్టుకోలేదు కాబట్టి ఈ సమయంలో మీరు వేడి పదార్థాలను తినండి. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించండి ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా ఈ సమయంలో గోరువెచ్చని నీటిని కొంత సమయం పాటు నోటిలెనే ఉంచండి. కానీ ఇది 5 నుంచి 10 సెకన్లకు మించకూడదు. మొత్తంగా ఈ ప్రక్రియను మూడు నుంచి నాలుగు సార్లు రిపీట్ చేయండి. ఇలా ఉప్పు నీరు పుక్కిలించిన తర్వాత.. నేరుగా ఓపెన్ ఎయిర్ లేదా AC గదిలోకి వెళ్లకూడదు. తర్వాత మీ గొంతును గుడ్డతో బాగా కప్పుకోండి.

వేడి అల్లం టీ తాగండి:
అల్లం టీ కూడా ఉపశమనం కలిగిస్తుంది. నిజానికి అల్లంకు బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తి ఉంటుంది. వేడి నీటిలో 2 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తాగండి. ఇందులో ఉండే అసిడిక్ గుణం గొంతులోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. తద్వారా మీ గొంతు నొప్పి ఈజీగా తగ్గుతుంది.

Also Read:  సోంపు వాటర్‌తో వెయిట్ లాస్..

పసుపు పాలు:
రాత్రిపూట ఒక చెంచా పసుపు పొడిని వేడి పాలలో కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి, వాపు , ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం లభిస్తుంది. ఈజీగా గొంతు నొప్పి తగ్గాలంటే పసుపు పాలను తాగాలి.

తులసి నీరు :
తులసిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులసి నీరు తాగడం వల్ల గొంతు నొప్పి ఈజీగా తగ్గుతుంది. ఎక్కువ రోజులు గడిచినా కూడా ఈ ఇన్ఫెక్షన్లు తగ్గాలి అంటే మాత్రం హోం రెమెడీస్ ట్రై చేయండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×