ఫోన్ ప్రియులు ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురుచూసిన Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ తాజాగా భారతదేశంలో లాంచ్ అయింది.

ఈ ఫోన్ సింగిల్ వేరియంట్‌లో వచ్చింది. 8GB/256GB మోడల్‌ ధర కేవలం రూ. 23,999 నుండి ప్రారంభమవుతుంది.

దీనిపై బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 వరకు 10 శాతం తగ్గింపు ఉంటుంది.

భారతదేశంలో సెప్టెంబర్ 24 నుండి Flipkart, Motorola.in సహా ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్‌ల ద్వారా సేల్‌కు అందుబాటులోకి వస్తుంది.

ఈ ఫోన్ సూపర్ HD 1.5K (2712 x 1220 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. వీటితో పాటు డిస్ప్లే LTPO టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

ఇది 68W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4310 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ఇందులో OIS సపోర్ట్‌తో 50MP Sony LYTIA-700C ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ అందించారు.

అలాగే 120° FOV, మాక్రో విజన్ సపోర్ట్‌తో 13MP అల్ట్రావైడ్ లెన్స్, చివరగా 10MP టెలిఫోటో యూనిట్‌తో zoom3x ఆప్టికల్ యూనిట్‌ను అందించారు.

ఫోన్ ముందువైపు ఎడ్జ్ 50 నియో ఆటోఫోకస్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరా అమర్చబడింది. అలాగే ఇది MediaTek డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది.