EPAPER

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Sweets: స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పండుగలు వస్తున్నాయంటే ఎవరికి అయినా ముందుగా గుర్తుకు వచ్చేది స్వీట్స్ మాత్రమే. అంతేకాదు ఏదైనా మంచి పని చేసినా లేక జీవితంలో ఏదో ఒక గొప్ప విజయం సాధించినా, ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిల్లో వచ్చే లాభాలు, విజయాలకు కూడా ముందుగా స్వీట్ తినిపించి నోరు తీపి చేస్తుంటారు. అయితే స్వీట్స్ తినడం వల్ల రుచికి బాగానే ఉన్నా కూడా రక్తంలోని చక్కెర స్థాయిని పెంచుతుందని నిపుణులు చెబుతుంటారు. స్వీట్లు ఆరోగ్యానికి హానికరమని అంటుంటారు. అయితే తీపి తినాలి అనే కోరిక ఉన్న వారు వీటిని తినడానికి కూడా ఓ సమయం చూసుకోవాలట. సాధారణంగా చాలా మందికి భోజనం చేసిన తర్వాత స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. సాధారణంగా స్వీట్లు తింటే మంచిదే. కానీ కొన్ని సమయాల్లో తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందువల్ల స్వీట్స్ తినడానికి ఓ సరైన సమయం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


స్వీట్లు తినడానికి ఉత్తమ సమయం ఇదే :

స్వీట్లు అంటే ఇష్టం ఉన్నవారు సాధారణంగా వ్యాయామం చేసే ముందు స్వీట్లు తినాలి. అది కూడా 30 నిమిషాల ముందు స్వీట్లు తీసుకుంటే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వ్యాయమం చేసే ముందు స్వీట్లు తినడం వల్ల కేలరీలను వ్యాయమం ద్వారా తగ్గించుకోవచ్చు. అందువల్ల ఈ సమయం ఉత్తమమైనది. అంతేకాదు మధ్యాహ్నం సమయంలో కూడా స్వీట్లు తింటే మంచిదే. ఇది కూడా మంచి సమయం అనే నిపుణులు అంటున్నారు.


స్వీట్లు ఈ సమయంలో అస్సలు తినకూడదు :

సాధారణంగా చాలా మందికి రాత్రి వేళ భోజనం తర్వాత స్వీట్లు తినేందుకు ఇష్టపడుతుంటారు. కానీ ఈ సమయం స్వీట్లు తినడానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు స్వీట్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో తింటే శరీరంలో కేలరీలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. కొవ్వు పేరుకుపోయేందుకు కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువగా తీసుకుంటే కలిగే సమస్యలు :

స్వీట్లు ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు ఇది గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×