EPAPER

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Coffee Powder Face Pack for Glowing Skin: ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని.. ముఖంపై మచ్చలు లేకుండ, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో బయటకు అడుగుపెట్టనిదే పని కాదు. కాలుష్యం, ఎండ, కారణంగా ముఖం నల్లగా మారుతుంది. ముఖంపై మచ్చలు కూడా ఎక్కువవుతాయి. ఒక విధంగా ఫేస్ కూడా డల్‌గా కనిపిస్తుంది. అందుకోసం పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే కాఫీ పొడితోనే ముఖంపై మచ్చలు, నలుపు దనానికి చెక్ పెట్టొచ్చు. అందాల ప్రపంచంలో కాఫీ పొడి ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతుంది. కాఫీ పొడిలో చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. కాఫీ పొడి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. కాఫీపొడితో ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కాఫీ పొడి, తేనె
ముఖంపై మచ్చలు తొలగిపోవాలంటే కాఫీ పొడి, తేనె ఉపయోగించవచ్చు. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి ముఖంపై మచ్చలు తొలగించడంలో ప్రధానపాత్ర వహిస్తాయి. అంతేకాదు చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ కాఫీపొడిలో టీస్పూన్ తేనె కలిపి వాటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై మచ్చలు తగ్గిపోయి.. కాంతివంతంగా మెరుస్తుంది.

కాఫీ, అలోవెరా జెల్
కాఫీ, అలోవెరా జెల్ కూడా మచ్చలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలోవెరా జెల్‌లో యాంటీఆక్సీడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ముఖం మచ్చలు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి ముఖ ఛాయను కూడా మెరుగుపరుస్తాయి. ఫేస్ ప్యాక్ కోసం రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడిలో టీస్పూన్ అలోవెరా జెల్ వేసి వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


Also Read: సోంపు వాటర్‌తో వెయిట్ లాస్..

కాఫీ పొడి, ఓట్ మీల్, పెరుగు
రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడిలో టీస్పూన్ ఓట్ మీల్ పౌడర్, కొంచె పెరుగు వేసి వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

కాఫీ,తేనె, పెరుగు, శెనగ పిండి

మూడు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ శెనగ పిండి, కొంచెం పెరుగు కలిపి వాటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే ముఖంపై నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. మీ చర్మం మిల మిల మెరిసిపోతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×