EPAPER

Re-release: దేవర ముందు ఈ రీ-రిలీజుల గోల ఏంటి? ఏకంగా నాలుగా?

Re-release: దేవర ముందు ఈ రీ-రిలీజుల గోల ఏంటి? ఏకంగా నాలుగా?

Next week four re-release tollywood movies coming in theatres: రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక నిమజ్జనం హడావిడిలో ఉన్నాయి. వచ్చే వారం దేవర సినిమా రిలీజ్. దాదాపు థియేటర్లు ఏవీ దొరకని పరిస్థితి. ఒకవేళ ఏదైనా సినిమా వచ్చి మంచి టాక్ తెచ్చుకున్నా..దేవర కోసం ఈ మూవీ ని థియేటర్ నుంచి తీసేయాల్సి ఉంటుంది. అందుకే ఈ వారం కొత్త సినిమాలేవీ విడుదల చెయ్యడం లేదు నిర్మాతలు. అయితే థియేటర్లు ఖాళీగా ఉంటాయనే బాధ లేదు. ఎందుకంటే ఏకంగా నాలుగు రీరిలీజ్ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు.


రీరిలీజ్ ట్రెండ్

ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలంతా రీరిలీజ్ సినిమాలపై దృష్టి సారించారు. రీరిలీజ్ సినిమాలు కూడా నిర్మాతలకు ఇంకా బంగారు బాతుల్లాగా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. కలెక్షన్ల మోత కూడా మోగించేశాయి. మహేష్ నటించిన ఇరవై ఏళ్ల క్రితం మూవీ మురారిని రీసెంట్ గా విడుదల చేస్తే ఆ మూవీ ఏకంగా రూ.12 కోట్లు కలెక్ట్ చేసింది. అన్ని చోట్లా ఈ సినిమాకు మరోసారి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్,చిరంజీవి ఇంద్ర, నాగార్జున మాస్ సినిమాలన్నీ రీరిలీజై మంచి కలెక్షన్ల పంట పండించాయి. అయితే అవన్నీ స్టార్ హీరోల సినిమాలు కావడంతో వాళ్లకంటూ అభిమానులు ప్రత్యేకంగా ఉంటారు. అందుకే వాళ్లు ప్రస్టేజ్ గా తీసుకుని టిక్కెట్లన్నీ ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటారు.


ఏకంగా నాలుగు

ఒకప్పుడు మంచి విజయాలు సాధించిన సినిమాలు కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. బాక్సాఫీస్ భారీ కలెక్షన్లు ఈ సినిమాలు ఎలా రాబడతాయని సినీ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ సినిమాలన్నీ టీవీలలో ఒకటికి పదిసార్లు వచ్చినవే. మరోసారి చూడటానికి సినిమా థియేటర్ల దగ్గరకు వస్తారా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేవారం దాదాపు ఖాళీ అయిన థియేటర్లను దృష్టిలో పెట్టుకుని కొందరు నిర్మాతలు తమ పాత హిట్ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో రజనీకాంత్ నటించిన ‘శివాజీ..ద బాస్’ అనే మూవీ కూడా ఉంది. తమిళనాడులో అయితే రజనీకాంత్ సినిమాను చూసేందుకు అభిమానులు ఎగబడతారు కానీ తెలుుగులో ఎంతవరకూ చూస్తారో ప్రేక్షకులు. ఇప్పటికే చాలా సార్లు టీవీలలో చూసేసిన ప్రేక్షకులు కొత్తగా ‘శివాజీ’లో ఏం చూస్తారనేది సందేహం అంటున్నారు సినీ విమర్శకులు. సెప్టెంబర్ 20న రీ రిలీజ్ కాబోతోంది శివాజీ మూవీ. 21న రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన మూవీ ‘వెంకీ’. మిస్టర్ బచ్చన్ మూవీ ఫెయిల్ అవడంతో నిరుత్సాహంతో ఉన్న రవితేజ ఫ్యాన్స్ ‘వెంకీ ’ మూవీతో ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నారు నిర్మాతలు.

టికెట్ రేట్లు సగం తగ్గిస్తే బెటర్

దిల్ రాజు నిర్మాతగా సిద్ధార్థ్, జెనీలియా జంటగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ అపూర్వ విజయం సాధించింది. టీవీలలోనూ మంచి వ్యూస్ ను సాధించుకుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘బొమ్మరిల్లు’ మూవీ ని కూడా 21న రిలీజ్ చేయనున్నారు. శర్వానంద్, అంజలి, జై నటించిన సురేశ్ కొండేటి నిర్మాణ సారధ్యంలో వచ్చి అపూర్వ విజయం సాధించింది ‘జర్నీ’. ఇది కూడా 21నే రిలీజ్ చేయనున్నారు.
అయితే పాత సినిమాలు ఒకప్పుడు రీ రిలీజవుతుండేవి. ఇదేమీ కొత్త కాదు. అయితే ఇలాంటి పాత సినిమాలకు కాస్త టిక్కెట్ రేట్లు సగానికి సగం తగ్గించేసి విడుదల చేస్తే బాగుంటుందని సగటు ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×