EPAPER

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Harish Rao Key Role in BRS Party: అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌లో సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి. ఉద్యమకాలం నుంచి మొన్నటి లోక్‌సభ ఎన్నికల వరకు కారుని పరుగులు పెట్టించిన కేసీఆర్.. స్టీరింగ్ వదిలేసి ఫాంహౌస్‌కి పరిమితమయ్యారు. అప్పట్లో చిన్నబాస్‌గా ఫోకస్ అయిన కేటీఆర్ ప్రెస్‌మీట్లు, సోషల్‌మీడియా పోస్టులతో సరిపెట్టేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో హరీష్‌రావు దూకుడు గులాబీశ్రేణుల్లో జోష్ నింపుతోంది. గులాబీ పార్టీకి అన్నీతానే అయినట్లు వ్యవహరిస్తున్న హరీష్‌రాపును ప్రశంసలతో ముంచెత్తుతూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడితో గులాబీ బాస్ ఇక రిటైర్ మెంట్ తీసుకున్నట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పాడి కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్లో నేను సైతం అంటూ ఎంటర్ అయి సైబరాబాద్ సీపీ కార్యాలయం ముందు ఆందోళన చేసిన తన్నీరు హరీష్‌రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ టైంలో జరిగిన తోపులాటలో ఆయన గాయపడ్డారు. సదరు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హరీష్ అభిమానులు దాన్ని లైకులు, షేర్లతో వైరల్ చేస్తున్నారు.

పోరాటం మన వారసత్వమని మరవకు సోదర.. థాంక్యూ రేవంత్.. మళ్లీ ఉద్యమం చేసే అవకాశం మా యువతకు ఇచ్చావ్.. మీడియా, సోషల్ మీడియా అంతగా లేనప్పుడే ఉద్యమాన్ని ఉరకలెత్తించినం. ఇప్పుడు అన్ని ఉన్నాయి. చూస్కో మళ్ల.. ఆగం ఐతున్న మా రాష్ట్రం కోసం తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ప్రతీ యువత కదులుతం.. అంటూ హరీష్‌రావుకి సంఘీభావం ప్రకటిస్తున్నారు.


తెలంగాణ ఉద్యమ కాలం నాటి వేడి గుర్తొచ్చే బ్యాక్‌గ్రౌండ్‌తో హల్‌చల్ చేస్తున్న ఆ వీడియోని చూస్తూ బీఆర్ఎస్‌లోని సీనియర్లు, ఉద్యమకారులు ఉద్యమకాలం నాటి రోజులు గుర్తుచేసుకుంటున్నారు. 2009 నవంబరు 29న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కసం ఆమరణదీక్షకు కూర్చున్నారు. తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఆరోజు కేసీఆర్ హడావుడి చేశారు.. అందుకే నవంబర్ 29ను దీక్షా దివస్ అని పిలుచుకుంటుంటాయి గులాబీ శ్రేణులు.. ఇప్పుడు హరీష్ వీడియోని చూస్తూ అప్పటి కేసీఆర్‌ని యాద్ చేసుకుంటున్నాయి.

Also Read: నా వల్ల కాదు.. బిడ్డా హ్యాండిల్ చేయు

అంతలావున హడావుడి చేసి సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్‌ని రెండు సార్లు ముఖ్యమంత్రిగా చూసిన ప్రజలు. ఇక చాల్లే అని పక్కన పెట్టేశారు. తెలంగాణ జాతిపితగా తన అనుచరులతో పిలుపించుకున్న కేసీఆర్ ఆ పరాభవంతో కారు స్టీరింగ్ వదిలేసి ఫాంహౌస్‌లో సెటిల్ అయిపోయారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబరు టూగా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీ నేతలు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు.

ఇప్పుడు బీఆర్ఎస్‌లో హరీష్‌రావు శకం ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారు. వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేసీఆర్, కేటీఆర్‌లు గుర్తుకురాకుండా దూకుడు పెంచుతున్నారు. కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. వీధుల్లోకి వచ్చి పోరాటాలు అంటే హరీష్‌రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవం.

ఇలాంటి పరిస్థితుల్లో తన్నీరు హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. కేసీఆర్ మెయిన్ స్ట్రీమ్‌లో నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి నుంచి హరీష్ రావు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. గులాబీ శ్రేణులకు కల్వకుంట్ల తండ్రి కొడుకులు లేని లోటు కనిపించకుండా చేస్తున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్‌లో కల్వకుంట్ల దొర శకం ముగిసి తన్నీరు వారి హవా మొదలైందన్న టాక్ వినిపిస్తుంది.

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: తిరుపతి లడ్డూలో జంతవుల కొవ్వు వాడకంపై స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే?

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×