EPAPER

Revanth: ఓ సన్నాసి రాజీనామా చేయకుండా ఎక్కడ దాక్కున్నావ్..?: టీపీసీసీ కొత్త చీఫ్ ప్రమాణ స్వీకారోత్సవంలో రేవంత్ రెడ్డి ఆగ్రహం

Revanth: ఓ సన్నాసి రాజీనామా చేయకుండా ఎక్కడ దాక్కున్నావ్..?: టీపీసీసీ కొత్త చీఫ్ ప్రమాణ స్వీకారోత్సవంలో రేవంత్ రెడ్డి ఆగ్రహం

CM Revanth Reddy Speech: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. పీసీసీ చీఫ్ కు పార్టీ అంతా అండగా నిలబడాలంటూ సీఎం అన్నారు.


‘తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పదేళ్లు అధికారం దక్కలేదు. గత ప్రభుత్వ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చాం. కాంగ్రెస్ విజయంలో కార్యకర్తలదే కీలక పాత్ర. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. పేదలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే రుణమాఫీని చేశాం. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం.. చేసి చూపించాం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన రెండో రోజు నుంచే హామీలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని నిరూపించాం.

Also Read: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనాలపై దుష్ప్రచారం.. మంత్రి పొన్నం క్లారిటీ


కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడిన తరువాతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామకాలు చేశాం. వచ్చే పంటలో సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తాం’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామంటూ ఆయన అన్నారు. కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్నారన్నారు. హరీశ్ రావు.. మేం రుణమాఫీ చేశాం.. రాజీనామా చేయకుండా నువ్వు ఎక్కడ దాక్కున్నావ్? అంటూ మాజీమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇటు అరికెపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి ఇష్యూపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘కొందరు కావాలనే గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం. రా చూసుకుందామని కౌశిక్ రెడ్డి ఎందుకు సవాల్ విసిరాడు? వీళ్లు వెళ్లి వీపు పగలగొడితే.. మళ్లీ కొట్టారంటూ వాళ్లు లొల్లి లొల్లి చేస్తారు. మా వాళ్లు ఎవరి జోలికి పోరు..వస్తే ఊరుకోరు. మహేశ్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకోకండి. మహేశ్ గౌడ్ వెనుక నేనుంటా. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్

అనంతరం టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గాంధీ భవన్ దేవాలయం లాంటిదన్నారు. తనకు సోనియా గాంధీ ఒక దేవత.. కాంగ్రెస్ కార్యకర్తలు దేవుళ్ల లాంటివారంటూ ఆయన పేర్కొన్నారు.

ఆ తరువాత సీనియర్ నేత వీహెచ్ మాట్లాడారు. కొత్త, పాత నాయకులు కలిసి పనిచేసేలా టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చూడాలన్నారు. పార్టీ కోసం పనిచేసేవాళ్లకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్రంలో కుల గణనను చేపట్టాలన్నారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×