EPAPER

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi flags off 6 new Vande Bharat trains: వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన జార్ఖండ్‌లోని టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ప్రారంభించాల్సి ఉండగా.. వర్షం కారణంగా వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇవాళ మొత్తం ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించగా.. కొత్త వందే భారత్ రైళ్ల సంఖ్య 54 నుంచి 60కి చేరింది.


టాటానగర్ – పాట్నా, బ్రహ్మపూర్ – టాటానగర్, రూర్కెలా – హౌరా, డియోఘర్ – వారణాసి, భాగల్పూర్ – హౌరా, గయా – హౌరా వంటి ఆరు వందే భారత్ రైళ్లు గంటకు 160 కి.మీల వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి.

24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజు 120 ట్రిప్పులతో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 54 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, మొత్తం 36వేల ట్రిప్పులను పూర్తి చేశామని ప్రకటించింది. కాగా, మొత్తం 3.17 కోట్లమంది ప్రయాణికులు వందే భారత్ రైళ్లలో ప్రయాణించారని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.


అలాగే, వివిధ రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఝార్ఖండ్‌లోని టాటానగర్‌లో 20వేల మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారులకు రూ.660 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వీటిని ఈనెల 16న సోమవారం ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇందులో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్ పూర్, రెండోది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్ గఢ్‌లోని దుర్గ్ వరకు రాకపోకలు కొనసాగించనున్నాయి.

Also Read: మద్య నిషేధంపై సంచలన ప్రకటన.. అధికారంలోకి వచ్చిన గంటలోపే!

అయితే ,ఈ రైళ్లు అందుబాటులోకి రావడంతో పలు ఆలయాలను దర్శించుకునేందుకు సులువైంది. ఝార్ఖండ్‌లోని డియోఘర్ బైద్యనాథ్ ధామ్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, కాళీఘాట్, పశ్చిమ బెంగాల్‌లోని బేలూర్ మఠం వంటి ఆలయాలకు సులువుగా ప్రయాణించవచ్చని రైల్వే శాఖ మంత్రి తెలిపారు. అంతేకాకుండా ధన్ బాద్‌లోని బొగ్గు, గనుల పరిశ్రమలు, కోల్‌కతాలోని జూట్ పరిశ్రమలు, దుర్గాపూర్ లో ఇనుము, ఉక్కు అనుబంధ రంగాలకు ఈ వందే భారత్ రైళ్లు ప్రోత్సాహకరంగా ఉండనున్నాయి.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×