EPAPER

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Neeraj Chopra Diamond League| భారత బల్లెల వీరుడు నీరజ్ చోప్రా అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిసాడు. బ్రసెల్స్‌లో జరుగుతున్న డైమండ్ లీగ్ జావెలిన్ త్రో ఫైనల్ పోటీల్లో కేవలం 0.01మీటర్లు తక్కువ కావడంతో టైటిల్ మిస్ అయ్యాడు. గ్రెనేడియన్ జావెలిన్ త్రో ఆటగాడు ఆండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రో చేసి డైమండ్ లీగ్ చాంపియన్ గా అవతరించాడు. మరోవైపు నీరజ్ చోప్రా 87.86 మీటర్ల త్రో చేయడంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


ఈ సంవత్సరం పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రో పోటీల్లో చాంపియన్ గా నిలవగా భారత ఆటగాడు నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. అయితే డైమండ్ లీగ్ పోటీల్లో చాంపియన్ గా అవతరించిన ఆండర్సన్ పీటర్స్ మరెవరో కాదు పారిస్ ఒలింపిక్స్ లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించిన ఆటగాడే కావడం విశేషం.

కొన్ని వారాల క్రితం లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా.. బ్రసెల్స్ డైమండ లీగ్ పోటీలపై చాలా ఆశలుపెట్టుకున్నాడు. కానీ అదృష్టం ఈసారి ఆండర్సన్ పీటర్స్ ను వరించింది.


బ్రసెల్స్ లో డైమండ్ లీగ్ జావెలిన్ త్రో ఫైనల్స్ పోటీలు ఉత్కంఠంగా సాగాయి. ఫైనల్స్ లో ఆండర్సన్ పీటర్స్ 87.87m త్రో చేశాక.. నీరజ్ చోప్రా మొదటి ప్రయత్నంలో 86.82m చేయగా.. చివరి ప్రయత్నంలో 87.86 మీటర్ల త్రో చేసి జస్ట్ మిస్ అయ్యాడు. మరోపైపు జర్మన్ స్టార్ జావెలిన్ త్రో యర్ జూలియన్ వెబర్ తన బెస్ట్ త్రో 85.97m చేసి మూడో స్థానికి పరిమితమయ్యాడు. నాలుగో స్థానంలో నిలిచిన ఆండ్రియన్ మర్డ్‌రే ఏకంగా మూడుసార్లు ఫౌల్ చేసి 82.79 మీటర్ల త్రో చేశాడు.

Also Read: విరాట్ – బాబర్.. ఒకే జట్టులో గురుశిష్యులు ?

2020 టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ అయిన నీరజ్ చోప్రా ఈ సంవత్సరం వరుసగా అంతర్జాతీయ పోటీల్లో టైటిల్ చేజార్చుకోవడం ఇది నాలుగోసారి. దోహా డైమండ్ లీగ్ పోటీల్లో కూడా రెండో స్థానానికే పరిమితమైన నీరజ్.. ఆ తరువాత పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో, లుజానె డైమండ్ లీగ్ పోటీల్లో ఇప్పుడు మళ్లీ బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో టైటిల్ ని అందుకున్నట్లే అన్నంత త్రో చేసి మిస్ చేసుకోవడంతో భారతదేశంలోని అతని కోట్లాడి అభిమానులు నిరాశ చెందారు.

చోప్రా ప్రైజ్ మనీ రూ.10 లక్షలు
నీరజ్ చోప్రా బ్రసెల్స్ డైమండ్ లీగ్ పోటీల్లో రెండో స్థానం నిలవడంతో అతనికి 12000 డాలర్లు(దాదాపు రూ.10 లక్షలు) ప్రైజ్ మనీ లభించింది. మరోవైపు టైటిల్ విన్నర్ ఆండర్సన్ పీటర్స్ కు 30000 డాలర్లు (రూ.25.16 లక్షలు) లభించాయి.

Also Read: మహిళల టీ 20 ప్రపంచకప్.. టికెట్ ధర ఎంతో తెలుసా?

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×