EPAPER

Waxing Tips: కాళ్ళకీ, చేతులకి వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత ఈ పనులు చేయకండి, చర్మం నల్లగా మారిపోతుంది

Waxing Tips: కాళ్ళకీ, చేతులకి వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత ఈ పనులు చేయకండి, చర్మం నల్లగా మారిపోతుంది

Waxing Tips: అమ్మాయిలు కాళ్లపై, చేతులపై ఉండే సన్నపాటి వెంట్రుకలను కూడా తొలగించుకునేందుకు వ్యాక్సింగ్ చేయించుకుంటారు. అయితే వ్యాక్సింగ్ చేయించుకున్నాక కొన్ని తప్పులు చేయకూడదు. అలా చేయడం వల్ల వ్యాక్సింగ్ చేయించుకున్న దగ్గర చర్మం నల్లగా మారిపోయే అవకాశం ఉంది.


ఒకప్పుడు చేతులు, కాళ్లు కప్పుకునేలా దుస్తులు ధరించేవారు. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో స్లీవ్ లెస్ టాప్‌లు, మినీ స్కర్టులు ఎక్కువైపోయాయి. అందుకే చేతులు, కాళ్లపై ఉన్న చిన్న చిన్న వెంట్రుకలను కూడా తొలగించుకోవాలని అమ్మాయిలు భావిస్తున్నారు. ఇలా అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి ఎక్కువ మంది చేసే పద్ధతి వ్యాక్సింగ్. చర్మాన్ని వ్యాక్సింగ్ చేయడం ద్వారా ఆ వెంట్రుకలను తొలగించుకోవచ్చు. దీనివల్ల అక్కడున్న చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది. వ్యాక్సింగ్ అనేది చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక పద్ధతి.

అయితే వ్యాక్సింగ్ చేయించుకున్న కొందరిలో చర్మం అలెర్జీలు కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆ ప్రాంతంలో దురద రావడం, ఎర్రగా మారిపోవడం, చిన్న దద్దుర్లు వంటివి రావడం జరుగుతూ ఉంటాయి. వ్యాక్సిన్ తర్వాత చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల అలాంటి రియాక్షన్ వస్తుంది. వ్యాక్సింగ్ తర్వాత ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి.


వ్యాక్సింగ్ తర్వాత చేయకూడని పనులు

వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత వేడి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అక్కడ చర్మం నల్లగా మారిపోతుంది. ఎక్కడైతే వ్యాక్సింగ్ చేయించుకున్నారో అక్కడ చర్మం పై చల్లని నీటిని పోయండి. రంగు మారకుండా చర్మం తాజాగా కనిపిస్తుంది.

వ్యాక్సింగ్ చేయించుకున్న వెంటనే బయటికి వెళ్ళకండి. ఇలా వెళ్లడం వల్ల ఆ ప్రాంతం పై సూర్యకాంతి పడి చర్మం నలుపుగా మారిపోతుంది. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఎక్కడ వ్యాక్సింగ్ చేయించుకున్నారో ఆ చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయండి.

వ్యాక్సింగ్ చేసేటప్పుడు చర్మంపై పౌడర్ ను వేయండి. దీనివల్ల వ్యాక్సింగ్ నొప్పి లేకుండా జరుగుతుంది. వ్యాక్సింగ్ అయిపోయాక చర్మంపై ఖచ్చితంగా మాయిశ్చరైజర్ ను రాయడం మర్చిపోవద్దు. చాలా మంది ఆ పని చేయరు.

Also Read: మిరియాలా మజాకా.. వీటితో ఎన్ని సమస్యలు పరార్ అవుతాయో తెలుసా

కలబంద నుంచి వచ్చే జెల్ చర్మ సౌందర్యానికి ఎంతో అవసరం. వ్యాక్సింగ్ చేయించుకున్నాక మీకు చర్మంపై మంట, దురద వంటివి అనిపిస్తే వెంటనే కలబంద జెల్‌ను పూయండి. అంతేకానీ దురద వస్తుందని గోకడం వంటివి చేయొద్దు. అక్కడ దద్దుర్లు వంటివి మొదలైపోతాయి. కాబట్టి కలబంద జెల్ రాస్తే దురద, దద్దుర్లు వంటివి రాకుండా ఉంటాయి. అలోవెరా జెల్ చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.

వ్యాక్సింగ్ చేయించుకోవడానికి ముందు ఆ ప్రాంతంలో ట్రిమ్మింగ్, షేవింగ్ వంటి పనులు చేయకండి. వ్యాక్సింగ్ చేయించుకోవడానికి ముందు ఆ ప్రాంతాన్ని సబ్బుతో బాగా కడగండి. మరీ వేడిగా ఉన్న వ్యాక్స్‌ను ఉపయోగించకండి. చర్మం కాలిపోయే అవకాశం ఉంది.

వ్యాక్సింగ్ అయ్యాక ఒక రెండు గంటల పాటు చర్మంపై సబ్బు, ఫేస్ వాష్ వంటిది ఉపయోగించకుండా ఉండండి. లేకుంటే చర్మంపై దురద సమస్య ఎక్కువైపోతుంది.

వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత బ్లీచింగ్ పద్ధతి అనుసరించకండి. బ్లీచింగ్ చేయడం వల్ల అందులో ఉండే రసాయనాలు చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. చర్మం ఎరుపుగా మారి వాపు వంటివి వస్తాయి. చర్మం దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వ్యాక్సింగ్ చేయించాక బ్లీచింగ్ వంటి పద్ధతిని అనుసరించకపోవడమే అన్ని విధాల మంచిది.

 

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×