EPAPER

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Australian all-rounder Matthew Short record:  ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్ చరిత్ర సృష్టించాడు. కార్డిప్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన మాథ్యూ షార్ట్.. ఏకంగా 5 వికెట్లు తీయడంతోపాటు బ్యాటింగ్‌లోనూ 28 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు. దీంతో షార్ట్ పేరిట సరికొత్త రికార్డు నమోదైంది.


టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై బౌలింగ్ గణాంకాలు ఇప్పటివరకు ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్ పేరిట ఉండేవి. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో వాట్సన్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

తాజాగా, ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో షార్ట్.. 5 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఫ్లేయర్‌గా రికార్డుకెక్కాడు. దీంతో 13ఏళ్ల వాట్సన్ రికార్డును షార్ట్ బ్రేక్ చేశాడు.


Also Read: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

ఇదిలా ఉండగా, ఇంగ్లండ్‌పై టీ20 మ్యాచ్‌లలో ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా షార్ట్ నిలిచాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్ చాహల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 2017లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్.. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు.

కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి విజయం అందుకుంది. అంతకుముందు జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమి చెందగా.. రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×