EPAPER

Kurnool Love Marriage Incident: చంటి సినిమా సీన్ రిపీట్.. తల్లిని చెట్టుకు కట్టేసి పిచ్చోడితో మరో పెళ్లి

Kurnool Love Marriage Incident: చంటి సినిమా సీన్  రిపీట్.. తల్లిని చెట్టుకు కట్టేసి పిచ్చోడితో మరో పెళ్లి

ఇంతకీ గోవిందమ్మపై దాడి ఎందుకు జరిగింది? ఆ గ్రామానికి .. గోవిందమ్మకు ఉన్న లింకేంటి? బాధితురాలి పేరు దళిత గోవిందమ్మ. ఆమెది అదే కల్లుకుంట గ్రామం. ఆరునెలల క్రితం ఆ గ్రామం నుంచి గోవిందమ్మ కుటుంబాన్ని వెలివేశారు. గ్రామ పెద్దలంతా కలిసి వారిని బహిష్కరించారు. అందుకు కారణం తన కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడమే. గోవిందమ్మ కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ఆరునెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన అమ్మాయి తరపు వాళ్లు పంచాయితీ పెట్టించారు. అప్పుడు ఆ గ్రామ పెద్దలు గోవిందమ్మ కుటుంబాన్ని ఊరు నుంచి వెళ్లిపోవాలని.. ఎప్పుడు ఇటువైపు రావొద్దని ఆదేశించారు.


Also Read: జ్యూస్ లో యూరిన్ కలిపిన అమీర్ ఖాన్.. చితకబాదిన స్థానికులు.. వీడియో వైరల్

దాంతో గోవిందమ్మ ఊరును ఖాళీ చేసి వెళ్లింది. కానీ ఏదో పని మీద మళ్లీ కల్లుకుంట గ్రామానికి రావాల్సి వచ్చింది. అలా రావడం చూసిన ఆ అమ్మాయి తరపు బంధువులు గోవిందమ్మను కరెంటు స్థంభానికి కట్టేశారు. మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేయాలని ట్రై చేశారు. వినకపోవడంతో ఆమెను గంటపాటు టార్చర్ చేశారు. గోవిందమ్మపై దాడి విషయం తెలుసుకున్న గ్రామంలోని దళితులు.. ఇతర సామాజికవర్గాల వారిపై రివర్స్‌ ఎటాక్‌ చేశారు. దాంతో సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టి గోవిందమ్మను విడిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

కులం.. కులం.. కులం మనిషి ఇతర గ్రహాలపై అడుగుపెడుతున్నాడు. మనం మాత్రం కులం చుట్టే తిరుగుతున్నాం. 2024 సంవత్సరంలోనూ ఇదే ముఖ్యమంటున్నాం. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచదేశాలు అభివృద్ధివైపు పరుగులు తీస్తుంటే మనం మాత్రం నీది ఏ కులం అని అడుగుతున్నాం. ఇంకెంత కాలం ఈ కులపిచ్చి. కులం ఏమైనా కూడుపెడుతుందా. ఇవన్నీ కూడా పంచ్ లైన్స్. కానీ ఇవేమి కూడా సమసమాజ నిర్మాణానికి దోహదపడలేకపోతున్నాయి. ఇన్నాళ్లూ దాడుల వరకు ఉన్న కులపిచ్చి ఇప్పుడు మరింత వైలంట్‌గా మారింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీన్ని ఆదిలోనే అంతం చేయకపోతే ఇదే సంస్కృతి అంతటికి పాకే ప్రమాదం లేకపోలేదు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×