వర్షాకాలంలో ముఖం మీద మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి

ఈ సీజన్‌లో చర్మంపై అలర్జీ ఫీలింగ్, ముఖం మీద ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి.

అందుకే వర్షాకాలంలో చర్మంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వర్షాకాలంలో చర్మానికి హాని కలగకుండా కాపాడుకోవచ్చు.

పసుపు చందనంతో చేసిన ఫేస్ ప్యాక్‌‌ను ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

రెండు స్పూన్ల గంధం పొడి, ఒక చెంచా పసుపు, కాస్త రోజు వాటర్‌లను కలిపి ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత శుభ్రం చేసుకోండి.

దీని వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మం కాంతి వంతంగా మెరుస్తుంది.

నిర్జీవమైన చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు ముఖానికి అలోవెరాను రాసుకోవచ్చు.

ఇది చర్మానికి తేమను అందించి కోల్పోయిన మెరుపును తిరిగి తెస్తుంది.

అలోవెరా జెల్ తరుచుగా ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు కూడా తగ్గుతాయి.