EPAPER

Pumpkin Juice Benefits: గుమ్మడికాయ జ్యూస్‌తో ఈ సమస్యలన్నీ దూరం

Pumpkin Juice Benefits: గుమ్మడికాయ జ్యూస్‌తో ఈ సమస్యలన్నీ దూరం

Pumpkin Juice Benefits: గుమ్మడికాయలో అనేక పోషకాలు ఉంటాయి. గుమ్మడికాయ రసం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్లకాయ, బీట్‌రూట్, దానిమ్మ, అరటితో పాటు అనేక రకాల జ్యూస్‌లు శరీరానికి మేలు చేస్తాయి. ఈ జాబితాలో గుమ్మడికాయ రసం కూడా ఉంటుంది. కానీ దీనికి తక్కువ జనాదరణ ఉంటుంది. ఇది ఇతర రసాలతో పోలిస్తే పోషకాలు, రుచి విషయంలో ఏ మాత్రం తక్కువకాదనే చెప్పాలి.


గుమ్మడికాయ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది , దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనితో పాటు, గుమ్మడికాయ రసం ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. గుమ్మడికాయ రసాన్ని కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా.

గుమ్మడికాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..


కంటికి మేలు చేస్తుంది:
గుమ్మడికాయలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ ఎగా మారుతుంది. ఇది కంటి చూపుకు చాలా మంచిది. కంటిశుక్లం, వయస్సు సంబంధిత మచ్చల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ విటమిన్ ఎంతో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది:
గుమ్మడికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
గుమ్మడికాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చర్మానికి మేలు చేస్తుంది:
గుమ్మడికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా ముఖంపై వచ్చే ముడతలను కూడా తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

గుండెకు ఆరోగ్యం:
గుమ్మడికాయలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గడం:
గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి కాయ రసం తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. బరువు తగ్గడానికి కూడా గుమ్మడి కాయ రసం సహాయపడుతుంది.

AlSO Read: బరువు తగ్గించే 5 మార్గాల గురించి మీకు తెలుసా ?

గుమ్మడికాయ రసం ఎలా తయారు చేయాలి ?

కావలసినవి:
గుమ్మడికాయ- 1 (చిన్నది)
నీరు – సరిపడా
తేనె లేదా బెల్లం – రుచికి సరిపడా
ఐస్ క్యూబ్స్ – 5-6

గుమ్మడికాయ రసం చేయడానికి..మొదట గుమ్మడికాయను కడగాలి. ఆ తర్వాత పొట్టును తీసివేయండి. విత్తనాలను కూడా తీసేసి గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను మిక్సీలో వేసుకుని కొద్దిగా నీళ్ళు కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ జ్యూస్ కి తేనె లేదా బెల్లం యాడ్ చేసుకోండి. ఇష్టమైతే ఐస్ ముక్కలను కూడా వేసుకోవచ్చు. అంతే జ్యూస్ రెడీ అయినట్లే. ఇలా తయారు చేసుకున్న ఈ జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించే గుణం దీని ఉంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Honey For Face: తేనెతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం

Big Stories

×