EPAPER

Vijayasai Reddy: మళ్లీ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. అందుకు ప్రధాన కారణం ఎవరో చెబుతూ..

Vijayasai Reddy: మళ్లీ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. అందుకు ప్రధాన కారణం ఎవరో చెబుతూ..

Vijayasai Reddy Posted A Comment on X against TDP: టీడీపీపై వైసీపీ సీనియర్ నేత విజయ సాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ తీవ్ర స్థాయిలో పైరయ్యారు. తాజాగా ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అందులో టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో సమస్యలను టీడీపీనే క్రియేట్ చేస్తుంది. పైగా ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు చేస్తుంది. రాష్ట్రంలో టీడీపీ వల్లే ప్రతినిత్యం సమస్యలు ఎదురవుతున్నాయి. ఏ రకంగా చూసినా కూడా ఈ సమస్యలన్నిటికీ టీడీపీనే ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. వీటి ద్వారా క్రెడిట్‌ను పొందేందుకు టీడీపీ తెగ ప్రయత్నిస్తున్నది. అందరం ఏకదాటిగా టీడీటీపై ఫైట్ చేద్దాం’ అంటూ ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Also Read: ముంబై నటి జెత్వానీ కేసు.. తొలి విడత ఇద్దరిపై వేటు, రెండో విడతలో..

ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆయన ట్వీట్ చేశారు. గతంలో సీఎం చంద్రబాబు హయాంలోనే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చిందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు.. కానీ, స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం ఏ మాత్రం చేయడంలేదు.. ఇది క్షమించరాని ద్రోహమంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వేలాదిమంది కార్మికుల జీవితాలు రోడ్డున పడుతాయన్నారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు క్షమించరన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రానికి తాకట్టుపెట్టారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


మరో ట్వీట్ లో.. ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వారు రాజీనామా చేయడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందన్నారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకుంటారన్నారు. లేకపోతే వారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరన్నారు. గతంలో ఇదే విషయంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారని, ఆయన రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారని గుర్తుచేశారు. గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకుని వీరిద్దరూ కూడా వెంటనే రాజీనామా చేయాలంటూ విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కూటమి ప్రభుత్వ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనదైన స్టైల్ లో చంద్రబాబుపై మండిపడుతున్నారు.

Also Read: యాంకర్ శ్యామలకు మాజీ సీఎం జగన్ బంపర్ ఆఫర్.. రాష్ట్రస్థాయిలో పదవి

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని విజయసాయిరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజల కోసం ఏచూరి పోరాడారన్నారు. నమ్మిన సిద్ధాంతాలను ఏచూరి జీవితాంతం ఆచరించారన్నారు. ఏచూరి స్ఫూర్తిదాయకమన్నారు. ఏచూరితో కలిసి పార్లమెంటులో పనిచేసే అవకాశం లభించడం తానెప్పటికీ మరిచిపోలేనని విజయసాయిరెడ్డి అన్నారు.

Related News

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి రాంబాబు

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Tirumala Laddu: తిరుమల లడ్డూపై వివాదం.. వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా మాజీ సీఎం చేశారా?

Ysrcp Mlas: ఇంట్లో కుంపటి.. జగన్‌కు ఇక ఝలక్‌ల మీద ఝలక్‌లే, ఎందుకంటే?

Kadambari Jatwani: న్యాయం కోసం.. హోంమంత్రి అనితను కలిసిన.. నటి కాదంబరి జత్వానీ

Big Stories

×