EPAPER

Jagga Reddy: హరీశ్‌రావు.. నీకు బుర్ర పనిచేయడం లేదా..?: జగ్గారెడ్డి

Jagga Reddy: హరీశ్‌రావు.. నీకు బుర్ర పనిచేయడం లేదా..?: జగ్గారెడ్డి

Jagga Reddy Comments on Harishrao and KTR: గత రెండు మూడు రోజుల నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయపరంగా మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేతలు ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఈ అంశంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ నడుస్తున్నది. తాజాగా బీఆర్ఎస్ నేతలు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయంగా ప్రత్యర్థి నన్ను కత్తితో పొడవటానికి వస్తే.. నేను ఊరుకోను. తిరిగి ఎదురు దాడి చేస్తాం..అదే రాజనీతి. కేసీఆర్..రేవంత్ ను పొడవడానికి వస్తే..చూస్తూ ఊరుకుంటారా రేవంత్. ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ దే. మా సీఎం పనికిరానివాడు అంటే నాలుక కోస్తం. కేటీఆర్ కానీ, వాళ్ళ అయ్య కానీ ఎవరన్నా కూడా వాళ్ల నాలుక కోస్తం. మా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టకండి. హరీశ్‌రావుకి ఎలుగు బంటి కరించినట్టు ఉంది. కేసీఆర్ కత్తితో పొడిస్తే.. రేవంత్ చూస్తూ ఊరుకోలేరు కదా..? సర్కార్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ దే.. అందుకే ఎదురు దాడి చేస్తున్నారు.. రేవంత్ చేసేది కరక్టే.


Also Read: ముంబై నటి జెత్వానీ కేసు.. తొలి విడత ఇద్దరిపై వేటు, రెండో విడతలో..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాదిరిగా ఇంత చిల్లరగా చేయరు. అనవసర రచ్చ బీఆర్ఎస్ చేస్తుంది. హైదరాబాద్ ప్రజల మూడు కరావ్ చేశారు. వినాయకుడి పూజను చూడకుండా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వాస్తవానికి ఈ సమయంలో ఖైరతబాద్ వినాయకుడిని చూపించేవి టీవీలు. కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొల్లి పెట్టి ఖైరతాబాద్ వినాయకుడిని ప్రజలు చూడకుండా చేశారు. వినాయకుడి సేవలో పోలీసులు ఉన్నారు. హరీశ్ రావు నీకు బుర్ర పనిచేయడం లేదా? రోడ్డుమీదకు కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది. పోలీసులు.. భార్యాపిల్లలను వదిలేసి మండపాల్లో ఉన్నారు. ఆంధ్రా ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నది మీరే. చేపల పులుసు తిన్నది మీరే. ఆంధ్రోళ్లకి టికెట్ ఇచ్చింది మీరే. జగన్ దగ్గరికి పోతరు.. రోజా చేసిన చేపల పులుసు తింటరు.. ఏందిరా నాయనా మీ పంచాయితీ..  పవర్ పోయేసరికి నిద్ర పట్టడం లేదా?. కల్లు తాగిన కోతి లెక్క ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్ధతి.


నేను వైఎస్ హయాంలో కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ఎమ్మెల్యేలకు డైరెక్ట్ కండువా కప్పిన సంస్కృతి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాతనే మొదలైంది కండువాలు కప్పుడు. 2014 నుండి 2018 వరకు నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది కేసీఆరే. ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కేసీఆర్ కదా..? సీఎల్పీల విలీనం కూడా కేసీఆరే తెచ్చాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకుని విలీనం చేసింది నువ్వే కదా? మీ మామ.. మీ నాన్న తెచ్చిన పాలసినే కదా..? ముందు మీ మామ..మీ నాన్నని అడగండి. ముందు నువ్వు తప్పు చేశావు అని నిలదీయండి. కేసీఆర్ సీఎం అయ్యాకా రాజకీయాల్లో ఎథిక్స్ పోయాయి. మీ రాజకీయం నువ్వు.. మా రాజకీయం మేము చేస్తున్నాం. కేసీఆర్.. కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారు.

బీజేపీ డైరెక్షన్ లో కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారు కేసీఆర్. నీతి మాలిన నియమాలులేని పాలన చేశారు. కేటీఆర్ పరిపాలన చేసింది తెలంగాణలో.. కానీ, భాష మాత్రం ఆంధ్రా భాష మాట్లాడుతున్నారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుండి వలస వచ్చారు. అందుకే కేటీఆర్ కి ఆంధ్ర భాష వచ్చింది. హరీశ్‌రావును ఎలుగుబంటి కరిచినట్టు ఉంది. రెండు రోజులుగా ఆయన దుంకుడు చూస్తుంటే ఎలుగుబంటి కరిచినట్టు అనిపిస్తున్నది. లేకపోతే ఎలుగుబంటిని బీఆర్ఎస్ వాళ్లే కరిచినట్టు ఉంది.

Also Read: అఖండ కు అడ్డు ఎవడ్రా.. హిందూపురంలో పెద్దదిక్కు కరువైన వైసీపీ

కౌశిక్ రెడ్డికి, ఉత్తమ్‌కు ఏం సంబంధం? బీజేపీ సందుల్లో దూరాలి అని చూస్తుంది. రాజకీయం చేయడం తప్పితే బీజేపీకి ఏం తెలుసు? కౌశిక్ పంచాయతీ విషయంలో రేవంత్…ఉత్తమ్‌కు ఓ క్లారిటీ ఉంది. రెండు రోజులు టీవీలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×